ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ- బీజేపీ-జనసేన కూటమి సంచలనం సృష్టించింది. ఏకంగా 164 స్థానాల్లో విజయం సాధించడం విశేషం. టీడీపీ 144కు గానూ 135, జనసేన 21కి 21, బీజేపీ 10 చోట్ల పోటీ చేస్తే 8 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ ఒక్క చోట కూడా గెలవలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే 88 స్థానాల కంటే దాదాపు డబుల్ స్థానాలు టీడీపీ గెలిచింది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో దాదాపు 70 వేల మెజార్టీతో గెలిచారు. నారా లోకేశ్ మంగళగిరిలో అత్యధికంగా 91 వేల మెజార్టీతో గెలుపొందారు. నాలుగో సారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. 24 మందితో మంత్రి మండలిని ఏర్పాటు చేశారు. నూతన మంత్రులకు ఇటీవల శాఖలు సైతం కేటాయించారు. కొత్త మినిస్టర్లకు తాజాగా రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వం ఛాంబర్లు కేటాయించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు రెండో బ్లాక్‌లోని ఛాంబర్ నెంబర్ 211 కేటాయించారు. మిగతా మంత్రి వర్గానికి ఈ కింది విధంగా కేటాయించారు.
READ MORE: Health Problems: ఈ వ్యాధులు ఉన్న వాళ్లు బీర్ అస్సలు తాగొద్దు..
బ్లాక్-2లో ఏడుగురు మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు.
బ్లాక్-2లో డెప్యూటీ సీఎం పవన్, మంత్రులు నాదెండ్ల, నారాయణ, దుర్గేష్, అనిత, పయ్యావుల, ఆనం లకు ఛాంబర్ల కేటాయింపు.
బ్లాక్-3లో ఐదుగురు మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు.
బ్లాక్-3లో మంత్రులు గొట్టిపాటి, కొల్లు, సంధ్యారాణి, డోలా, ఎన్ఎడీ ఫరూక్ లకు ఛాంబర్ల కేటాయింపు.
బ్లాక్-4లో ఎనిమిది మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు.
బ్లాక్-4లో అనగాని, అచ్చెన్న, సవిత, టీజీ భరత్, లోకేష్, రాం ప్రసాద్ రెడ్డి, కొలుసు, నిమ్మలకు ఛాంబర్ల కేటాయింపు.
బ్లాక్-5లో ఐదుగురు మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు.
బ్లాక్-5లో బీసీ జనార్జన్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి, సత్యకుమార్ లకు ఛాంబర్ల కేటాయింపు.