ముఖ్యంగా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు బీర్ తాగడం డేంజర్ అని వైద్యులు చెబుతున్నారు. అవేవో తెలుసుకుందాం.  

ఉదరకుహర వ్యాధి బాధితులు బీర్ కి దూరంగా ఉండాలి. ఇది దీర్ఘకాలిక జీర్ణ సమస్యలను సూచిస్తుంది.

ఈ వ్యాధి, బాధితుల చిన్న పేగులను దెబ్బతీస్తుంది. గ్లూటెన్ ఉన్న ఆహారాలు తినడం వల్ల సమస్య పెరుగుతుంది.

అధిక బరువు ఉన్నవారు, బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేసేవారు బీర్ తాగకూడదు.

బీర్ లో కేలరీలు ఎక్కువగా, పోషక విలువలు తక్కువగా ఉంటాయి.దీనివల్ల బరువు పెరగవచ్చు. 

షుగర్, ప్రీడయాబెటిస్ బాధితులు బీర్ కి దూరంగా ఉండాలి.

దీంట్లో ఉండే షుగర్ కంటెంట్ కారణంగా రక్తంలో చక్కెర శాతం వేగంగా పెరుగుతుంది.  

తరచుగా గుండెల్లో మంట వచ్చే వ్యక్తులు బీర్‌ తాగకపోవడమే మంచిది.  

IBS అంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్. ఇది కడుపు, పేగులను ప్రభావితం చేసే వ్యాధి.

ఈ రుగ్మత ఉన్న వ్యక్తులు బీర్‌ తాగడం మానేయాలి.