NTV Telugu Site icon

Allola Indrakaran Reddy : నాందేడ్ స‌భ ఏర్పాట్లను పరిశీలించిన ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి

Indra Karan Reddy

Indra Karan Reddy

మ‌హారాష్ట్ర నాందేడ్ జిల్లా కేంద్రంలో ఫిబ్రవ‌రి 5న నిర్వహించ‌నున్న బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ పనులను అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పరిశీలించారు. ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్, బోధ‌న్ ఎమ్మెల్యే ష‌కీల్, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాల మల్లు, సివిల్ స‌ప్లైస్ కార్పోరేష‌న్ చైర్మ‌న్ ర‌వీంద‌ర్ సింగ్, ఇత‌ర ప్రజాప్రతినిధులతో కలిసి బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించి పలు సూచనలు చేసారు. సభాస్థలితోపాటు పార్కింగ్‌ ప్రదేశాలు, బారికేడ్లు, ఇత‌ర పనుల ప్రగతిని ప‌ర్య‌వేక్షించారు. సీఎం కేసీఆర్ తో పాటు జాతీయ స్థాయి నేతలు వస్తున్నందున ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సభా ప్రాంగణానికి చేరుకునే మార్గాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు.

Also Read : Rare Wild Cat : ఎవరెస్టు శిఖరంపై అత్యంత అరుదైన పల్లాస్‌ పిల్లులు

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌కు ఆక‌ర్షితులై చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆస‌క్తి చూపుతున్నార‌న్నారు. ఫిబ్ర‌వ‌రి 5న నిర్వహించ‌నున్న స‌భ‌లో సీయం కేసీఆర్ స‌మ‌క్షంలో మ‌హారాష్ట్ర‌కు చెందిన రాజ‌కీయ ప్ర‌ముఖులు, వివిధ రంగాల‌కు చెందిన వారు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న‌ట్లు సూచ‌న‌ప్రాయంగా వెల్ల‌డించారు.

Also Read : Gunfire In USA : అమెరికాలో మరోమారు పేలిన గన్.. ముగ్గురు స్పాట్ డెడ్

అదేవిధంగా మ‌హారాష్ట్ర ప్ర‌జ‌లు కూడా తెలంగాణ మోడ‌ల్ త‌ర‌హా పాల‌న కావాల‌ని కోరుకుంటున్నార‌ని తెలిపారు. జాతీయ స్థాయిలో రానున్నరోజుల్లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల‌కు త‌మ పార్టీ స‌మాయ‌త్తం అవుతుంద‌ని తెలిపారు. భావ‌సారూప్య‌త క‌లిగిన వివిధ రాష్ట్రాల‌కు చెందిన రాజ‌కీయ ప్ర‌ముఖులు… బీఆర్ఎస్ జాతీయ అధ్య‌క్షులు, సీయం కేసీఆర్ తో క‌లిసి ప‌ని చేసేందుకు ముందుకు వ‌స్తున్నార‌ని పేర్కొన్నారు.