Site icon NTV Telugu

Alleti Maheshwar Reddy : రుణమాఫీకి ఇన్ని కండిషన్స్ ఎందుకు..?

Mla Maheshwar Reddy

Mla Maheshwar Reddy

తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. రుణమాఫీ మార్గదర్శకాల పై ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా మహేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఎటువంటి కండిషన్ లేకుండా రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, మరి ఈరోజు ఇన్ని కండిషన్స్ ఎందుకు.? అని ఆయన అన్నారు. రీ షెడ్యూల్ అయిన రుణాలకు మాత్రమే రుణమాఫీ ఇస్తామని అంటున్నారని, చాలా బ్యాంకులు లోన్ రికవరీ అయ్యి మళ్ళీ కొత్తగా లోన్ ఇచ్చినట్టు బ్యాంకర్లు రైతు పుస్తకాల్లో రాసుకుంటారన్నారు. వాటి కి వర్తించదని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. బ్యాంకర్లు చేసిన తప్పిదాలకు రైతు బలి అవుతారని, ఎందుకీ కండిషన్ ? అని ఆయన ప్రశ్నించారు.

  Donald Trump: ట్రంప్‌పై దాడి ఘటన.. 3 తుపాకుల నుంచి 9 రౌండ్లు కాల్పులు

కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని, రేషన్ కార్డు అనే కండిషన్ పెట్టీ చాలా మందిని ఎగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఒకే రేషన్ కార్డు లో ఉన్న అన్నదమ్ములు భూములు పంచుకొని విడివిడిగా లోన్ తీసుకుంటారని, వారి పరిస్థితి ఏంటి..? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క రేషన్ కార్డు లో నలుగురి మీద లోన్ ఉంటే ఒక్కరికే ఇవ్వడంతో మిగతా వారు నష్టపోతారన్నారు. కుటుంబంలో ఒక్కరికీ చిన్న ఉద్యోగం ఉన్న కుటుంబం మొత్తానికి తెల్ల రేషన్ కార్డు తీసేస్తారని, వారి పరిస్థితి ఏంటని ఆయన అన్నారు. కండిషన్ పెట్టడం సరైన పద్ధతి కాదని, చిత్తశుద్ధి ఉంటే ఎటువంటి కండిషన్ లేకుండా రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

 KP Sharma Oli: నాలుగోసారి నేపాల్‌ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ ప్రమాణం.. మోడీ అభినందనలు

Exit mobile version