NTV Telugu Site icon

Alleti Maheshwar Reddy : తెలంగాణ రాష్ట్ర అత్మగౌరవానికి ప్రతీక సెప్టెంబర్ 17

Mla Maheshwar Reddy

Mla Maheshwar Reddy

భారీ వర్షాలతో తెలంగాణలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. రెండు కేంద్ర బృందాలు పర్యటిస్తూ నష్టాన్ని అంచనా వేస్తున్నాయని, NDRF బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వరదలతో చనిపోయిన వారి కుటుంబాలకు మూడు లక్షల రూపాయలు కేంద్రం సహాయం ప్రకటించిందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అత్మగౌరవానికి ప్రతీక సెప్టెంబర్ 17 అని, అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను నిర్వహించలేకపోతోందని ఆయన విమర్శించారు. సెప్టెంబర్ 17 స్వాతంత్ర దినోత్సవంగా, విమోచన దినోత్సవంగా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించలేకపోతోంది? అని ఆయన ప్రశ్నించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని గత BRS, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆలోచన లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి అవకాశం ఉందని, కర్ణాటక లో అధికారికంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు మహేశ్వర్‌ రెడ్డి. MIM కు భయపడి విమోచన దినోత్సవం జరపడం లేదా ? అని ఆయన అన్నారు.

Akkineni Family: వరద బాధితులకు అక్కినేని కుటుంబం సాయం ఎంతంటే?

అంతేకాకుండా..’ BRS ప్రభుత్వం జాతీయ సమైక్యత దినంగా నిర్వహించారు.. అసలు సమైక్యత దినం కాదు.. విమోచన దినంగా కాంగ్రెస్ నిర్వహించాలి. నిజాం పాలనలో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చరిత్రను కప్పిపుచ్చడానికే విమోచన దినం నిర్వహించడం లేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో విమోచన దినం జరపడం లేదని ప్రశ్నించిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోయారు. పదేళ్ల BRS పాలనలో విమోచన దినం జరపకుండా కాలయాపన చేశారు. సెప్టెంబర్ 17 విలీన దినం కాదు.. ఖచ్చితంగా విమోచన దినమే. భావితరాలకు చరిత్ర తెలియాలంటే విమోచన దినం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. విమోచన దినోత్సవం ఏ మతానికి, ఏ కులానికి వ్యతిరేకం కాదు. స్వాతంత్ర దినోత్సవం గా సెప్టెంబర్ 17ను జరుపుకుందాం. MIM ఆనందం కోసం విమోచన దినోత్సవం జరపడం లేదా? వరంగల్ మున్సిపల్ లో ఓ ప్రభుత్వ కార్యక్రమం లో కాకతీయ తోరణం లేకుండా లోగో ఏర్పాటు చేశారు. లోగో అధికారికంగా విడుదల చేశారా ? లోగో లో కాకతీయ తోరణం ఎందుకు తొలగించారు ?’ అని మహేశ్వర్‌ రెడ్డి అన్నారు.

Paris Paralympics 2024: భారత్ ఖాతాలో మరో రజతం.. 21కి చేరిన పతకాల సంఖ్య

Show comments