Site icon NTV Telugu

Alleti Maheshwar Reddy : బీజేపీఎల్పీ నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Maheshwar Reddy

Maheshwar Reddy

నెలరోజుల ఉత్కంఠ అనంతరం నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని శాసనసభాపక్ష నేతగా బీజేపీ అధిష్టానం బుధవారం నియమించింది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కామారెడ్డి ఎమ్మెల్యే కె వెంకట రమణారెడ్డిని డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌లుగా నియమించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ముధోలే ఎమ్మెల్యే రామారావు పటేల్‌ను శాసనసభా పక్ష కార్యదర్శిగా నియమించారు. పార్టీ చీఫ్ విప్‌గా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, విప్‌గా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూరయ్యనారాయణ గుప్తా నియమితులయ్యారు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డిని పార్టీ కోశాధికారిగా నియమించారు.

Tillu Square: టిల్లు స్క్వేర్ ట్రైలర్.. లిల్లీ దెబ్బకు చుక్కలు చూసిన టిల్లు 

కాగా.. ఏలేటి మహేశ్వర రెడ్డి నిర్మల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఆయన ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే అసెంబ్లీ బీఏసీ సమావేశానికి 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో ఒకరిని పిలవాలని ఆ పార్టీ శాసనసభ్యులు స్పీకర్‌ను కోరారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డిని పిలవాలని బీజేపీ ఎమ్మెల్యేలంతా సంతకాలు చేసిన లేఖను స్పీకర్‌కు అందించిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వరరెడ్డి బీఏసీ సమావేశానికి హాజరయ్యారు. దీనిని బట్టి బీజేపీ శాసనసభా పక్షనేతగా ఏలేటి మహేశ్వరరెడ్డి పేరును బీజేపీ హై కమాండ్ ఖరారు చేసింది.

Solar Eclipse Mars: అంగారకుడిపై సూర్యగ్రహణం.. ఆశ్చర్యంలో శాస్త్రవేత్తలు!

Exit mobile version