NTV Telugu Site icon

Bachchalamalli : “బచ్చల మల్లి” ఓటిటి రిలీజ్ డేట్ లాక్

New Project (85)

New Project (85)

Bachchalamalli : అల్లరి సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన హీరో నరేష్. ఫస్ట్ సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకుని కామెడీ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాడు. డిఫరెంట్ జానర్ చిత్రాలతోనూ అలరిస్తున్నారు. విజయ్ కనక మేడల దర్శకత్వంలో నటించిన ‘ నాంది’ సినిమాతో అల్లరి నరేష్ తన సినిమాల స్టైల్ మార్చేశాడు. రొటీన్ కథలను పక్కన బెట్టి కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు మాత్రమే చేస్తున్నారు. అలా చేస్తూనే హిట్స్ కూడా కొట్టేస్తున్నాడు అల్లరి నరేష్. మొన్న మధ్య తన ఓల్డ్ ఫార్మేట్ లో ఆ ఒక్కటి అడక్కు అని సినిమా చేసి ప్లాప్ చూశాడు. దాంతో ఈ సారి ఎలాగైన హిట్టు కొట్టాలి అని మరోసారి సీరియస్ సబ్జెక్ట్ తో బచ్చల మల్లి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అల్లరి నరేష్. “బచ్చల మల్లి” కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read Also : Pawan Kalyan: తప్పు జరిగింది.. క్షమించండి

‘బచ్చల మల్లి’ రిలీజ్‌కు ముందు మంచి అంచనాలను క్రియేట్ చేసింది. అల్లరి నరేష్ నుంచి వస్తున్న మరో సీరియస్ మూవీ కావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని కనబరిచారు. అయితే, ఈ సినిమా రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయింది. దీంతో ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఇక ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి అయితే ఇపుడు రెడీ అయ్యింది. ఈ సినిమా ఓటిటి హక్కులు మొత్తం మూడు సంస్థలు తీసుకోగా అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్స్ట్ అలాగే ఈటీవీ విన్ వారు సొంతం చేసుకోగా లేటెస్ట్ గా ఈటీవీ విన్ వారు అయితే డేట్ ని ఇచ్చేసారు. రేపు జనవరి 10 నుంచే ఈ చిత్రం స్ట్రీమింగ్ కి వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాలో అందాల భామ అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.

Read Also :Tejashwi Yadav: ఇండియా కూటమి కేవలం లోక్‌సభ ఎన్నికల కోసమే.. దుమారం రేపుతున్న తేజస్వీ వ్యాఖ్యలు

Show comments