NTV Telugu Site icon

Alla Nani: టీడీపీలో ఆళ్ల నాని చేరిక మరోసారి వాయిదా!

Alla Nani

Alla Nani

Alla Nani: టీడీపీలో ఆళ్ల నాని చేరిక మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. టీడీపీలోకి ఆళ్ల నానిని తీసుకునేందుకు పార్టీ పెద్దలు నిన్న ముహూర్తం ఫిక్స్ చేయగా.. పార్టీ అధినేత సమయం ఇవ్వక పోవడంతో ఆళ్ల నాని చేరిక వాయిదా పడింది. ఆళ్ల నాని చేరికపై టీడీపీ కేడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆళ్ల నాని చేరికతో కేడర్‌లో మరింత అసంతృప్తి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీ ఆలోచనలో పడింది. గతంలో అధికారంలో ఉండగా.. టీడీపీ నేతలు, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన ఆళ్ల నాని.. ఇప్పుడు అదే పార్టీలో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఏలూరులో పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆళ్ల నానిని చేర్చుకునేందుకు టీడీపీ గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వగానే దీనిపై విమర్శలు ప్రారంభమయ్యాయి. ఆళ్ల నాని టీడీపీ పార్టీలో చేరిక అంశం ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడింది. మరోమారు నానిని పార్టీలోకి తీసుకోవాలా వద్దా అనే విషయంపై అధిష్టానం పునరాలోచనలో పడింది.

Read Also: Harirama Jogaiah: మంత్రి నిమ్మలకు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ