NTV Telugu Site icon

Chandrayaan-3 Mission: అంతా సిద్దం.. చంద్రయాన్ 3 గురించి కీలక అప్డేట్ ఇచ్చిన ఇస్రో

Isro

Isro

భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ చంద్రయాన్ 3. విక్రమ్ రోవర్ ఈ రోజు చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టబోతుంది. ఇదే కనుక జరిగే భారత్ అంతరిక్ష పరిశోధనలో ఎలైట్ లిస్ట్ లో చేరుతుంది. అంతేకాకుండా జాబిల్లి దక్షిణ ధ్రువంపైకి అడుగుపెట్టిన తొలి దేశంగా చరిత్రకెక్కుతుంది. చంద్రయాన్ 3 చందమామపై సక్సెస్ ఫుల్ గా అడుగుపెట్టాలని దేశ వ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రయాన్ 3 కి సంబంధించి కీలక అప్డేట్ ను ఇస్రో ఎక్స్ ( ట్విటర్ ) ద్వారా పంచుకుంది. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగడానికి అన్ని అనుకూలంగా ఉందని ఇస్రో పేర్కొంది. ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ ను ప్రారంభించడానికి అన్ని సెట్ అయ్యాయని ఇస్రో తన ట్వీట్ లో తెలిపింది. ల్యాండర్ మాడ్యూల్ తాను చేరుకోవాల్సిన పాయింట్ వద్దకు 17:44గంటలకు చేరుకుంటుందని వెల్లడించింది. ఏఎల్ ఎస్ కమాండ్స్ అందుకున్న తరువాత పవర్ కోసం ఇంధన ఇంజన్లను ల్యాండర్ మాడ్యుల్ యాక్టివేట్ చేస్తుందని తెలిపిన ఇస్రో మిషన్ దగ్గర నుంచి వచ్చే కమాండ్లను ఆపరేషన్ టీమ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని తెలిపింది. దీనికి సంబంధించిన లైవ్ టెలికాస్ట్ 17:20 గంటలకు ప్రారంభమవుతుందని ఇస్రో ట్విటర్ వేదికగా తెలిపింది.  అంతా అనుకున్నట్లుగా సాగితే చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ సాయంత్రం గం.6.04 సమయానికి చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపుతుంది.

Also Read: Pak On Chandrayaan-3: చంద్రయాన్‌-3 ప్రయోగంపై పాకిస్తాన్‌ ప్రశంసలు

ఇక ల్యాండర్ జాబిల్లి పై దిగడానికి అనువుగా లేకపోతే దీనిని ఆగస్టు 27కు వాయిదా వేయవచ్చనే కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే మొత్తానికి ఇస్రో ఈ రోజే విక్రమ్ ల్యాండర్ ను చందమామ దక్షిణ ధ్రువం పై దించనుంది. దీంతో జాబిల్లి సౌత్ పోల్ ను చేరుకున్న తొలి దేశంగా చరిత్ర పుటల్లో నిలవనుంది. దీని కోసం యావత్ భారతదేశంతో పాటు ప్రపంచం కూడా ఎదురు చూస్తుంది. అయితే భారత్ కంటే ముందు ఈ ఘనత సాధించాలని ప్రయత్నించి లూనా 25 కుప్పకూలడంతో రష్యా భంగపాటుకు గురైన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచం మొత్తం చంద్రయాన్ వైపు చూస్తోంది. ఇస్రోతో పాటు చాలా ఛానల్స్ చంద్రయాన్ 3 ప్రయోగాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఇస్రో కు ఆల్ బెస్ట్ చెబుతూ ట్వీట్ చేస్తున్నారు. ఇస్రో ఈ ఘనత సాధించి కచ్ఛితంగా భారత కీర్తి పతాకాన్ని అంతరిక్ష పరిశోధనల్లో ఎగిరేలా చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులే కాకండా సెలబ్రెటీలు సైతం ఇస్రోకు గుడ్ లక్ చెబుతున్నారు.

Show comments