గత కొద్ది రోజులుగా కాంగ్రెస్‌లో అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలపై ఉత్కంఠ సాగుతోంది. ఈ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారన్నదానిపై దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి ఈ రెండు స్థానాలు కాంగ్రెస్‌కు ప్రత్యేకం కావడమే కారణం. ఇప్పటి వరకూ ఆయా రాష్ట్రాల్లో అభ్యర్థులను ప్రకటిస్తూ వచ్చిన కాంగ్రెస్.. ఈ రెండు స్థానాలను మాత్రం పెండింగ్‌లో పెడుతూ వస్తోంది. కాంగ్రెస్‌కు కీలకమైన ఈ రెండు స్థానాలను ఎందుకు పెండింగ్‌లో పెట్టిందో అర్థం కావడం లేదు. ఆలస్యం అయ్యేకొద్ది ఈ స్థానాలపై అనేక వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సస్పెన్ష్‌కు బుధవారం తెర దించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలకు ఇవాళ సాయంత్రంలోపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Election Commission: తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు.. కానీ అక్కడ 4 గంటల వరకే
ఇదిలా ఉంటే సోనియాగాంధీ ఈసారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలిగారు. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో కాంగ్రెస్‌కు కంచుకోటైన రాయ్‌బరేలీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. అయితే ఇక్కడ నుంచి ప్రియాంకాగాంధీ బరిలోకి దిగవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాయ్‌బరేలీలో నామినేషన్ గడువు శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో గురువారమే ఈ స్థానానికి అభ్యర్థిని ప్రకటించనున్నారు.
ఇక అమేథీపై కూడా ఇదే తరహా ఉత్కంఠ సాగుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి రాహుల్ గాంధీ ఓడిపోయారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. 55 వేల ఓట్ల మెజార్టీతో స్మృతి ఇరానీ గెలుపొందారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కూడా ఆమెనే బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఆమె నామినేషన్ దాఖలు చేశారు. కానీ కాంగ్రెస్ నుంచి మాత్రం క్లారిటీ రాలేదు. ఇక్కడ కూడా రకరకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమేథీ నుంచి ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన తన మనసులోని మాటను బయటకు చెప్పారు. అమేథీ నుంచే బరిలోకి దిగుతున్నట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు రాహుల్ గాంధీనే పోటీ చేయొచ్చని లీకులు వస్తున్నాయి. మొత్తానికి ఈ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. మే 3 నామినేషన్‌కు చివరి రోజు. దీంతో ఈ రోజే ఆ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు.
ఇది కూడా చదవండి: 26 Age- 22 babies: 26 ఏళ్ల వయసులో 22 మంది పిల్లలకు తల్లి అయ్యింది..
ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇండియా కూటమిలో భాగంగా ఇక్కడ సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్, ఇతర పక్షాలు కూటమి కట్టాయి. ఇక్కడ కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగతా స్థానాల్లో ఎస్పీ, ఇతర పార్టీలు పోటీ చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. ఇక మూడో విడత మే 7న జరగనుంది. అనంతరం మే 13, 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదలకానున్నాయి.
