NTV Telugu Site icon

Amrapali Kata : గణేష్ నిమజ్జనానికి జీహెచ్‌ఎంసీ తరఫున అన్ని ఏర్పాట్లు చేశాం..

Amrapali Kata

Amrapali Kata

గణేష్ నిమజ్జనానికి జీహెచ్‌ఎంసీ తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి కాటా తెలిపారు. ఈ నెల 17, 18, 19 మూడు రోజులపాటు 15000 మంది జీహెచ్ఎంసీ సిబ్బంది పని చేస్తారని ఆమె తెలిపారు. శానిటేషన్ సిబ్బంది, ట్యాంక్ బండ్‌లో గజ ఈతగాళ్లు ను ఏర్పాటు చేశామని ఆమె అన్నారు. నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం ట్యాంక్‌బండ్‌, సరూర్‌ నగర్ మంచినీళ్లు, ఫుడ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు అమ్రపాలి తెలిపారు. ఇప్పటికే రోడ్ రిపేర్స్, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేశామని, అన్ని మేజర్ చెరువుల వద్ద క్రేన్సు ఏర్పాటు చేశామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చిన్న చిన్న చెరువుల వద్ద బేబీ పాంట్స్ ను ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు.

 
Minister Ram Prasad Reddy: చిత్తూరు రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం
 

అనంతరం తెలంగాణ డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. తెలంగాణలో గణేష్ నిమజ్జనాల కోసం ఏర్పాట్లు చేసామన్నారు. బాలాపూర్ గణేషుడి నిమజ్జనం కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేసామని, బాలాపూర్ నుండి ట్యాంక్ బండ్ వరకు రూట్ ని పరిశీలించామన్నారు. హైదరాబాద్ సీపీ,రాచకొండ సీపీ,GHMC కమిషనర్, కలెక్టర్లమందరం కలిసి జాయింట్ ఇన్ఫెక్షన్ చేస్తున్నామని, కోఆర్డినేషన్ తో గణేష్ నిమజ్జనాలు సక్సెస్ చేస్తామన్నారు. అల్ డిపార్ట్మెంట్ కలిసిపోయి, పోయిన ఏడాది కంటే ఈసారి బాగా చేస్తామని, గత ఏడాది నిమజ్జనాల ఎలా కొనసాగయో.. రూల్స్ ప్రకారం ఫాలో అవుతూ వెళ్తామన్నారు. నిమజ్జనం కోసం 20వేల బందోబస్తు ఏర్పాటు చేసామని ఆయన తెలిపారు.

NASA: రికార్డు స్థాయిలో భూమి చుట్టూ తిరుగుతున్న వ్యోమగాములు.. ఎంతమంది ఉన్నారంటే..?