TTD: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది.. ఓ రోజుతో సంబంధం లేకుండా తిరుమల గిరులు భక్తులతో కళకళలాడుతూనే ఉంటాయి.. ఇక, ఏదైనా ప్రత్యేకమైన రోజు.. సెలవులు వచ్చాయంటే చాలు ఏడు కొండలు కిక్కిరిసిపోతాయి.. ఇక, శ్రీవారి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. ఎందుకంటే.. దర్శనం, విడిది నుంచి ప్రతీ సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచుతూ వస్తుంది టీటీడీ.. ఇప్పుడు అక్టోబర్ నెలకు సంబంధించిన లక్కి డిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ.. రేపటి నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు లక్కిడిఫ్ విధానంలో భక్తులు నమోదు చేసుకునే సౌలభ్యం ఉంటుంది..
Read Also: HD Kumaraswamy: జేడీఎస్‌ను దూరం పెట్టేశారా? యూపీఏ, ఎన్జీయే నుంచి అందని ఆహ్వానం
మరోవైపు.. ఈ నెల 21వ తేదీన ఉదయం 10 గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించిన కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల్ సేవా, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లను విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. మరోవైపు ఈ నెల 24వ తేదీన ఉదయం 10 గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది టీటీడీ. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది.. ఇక, ఆదివారం రోజు శ్రీవారిని 86,170 మంది భక్తులు దర్శించుకోగా.. 31,128 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.13 కోట్లు భక్తులు సమర్పించినట్టు టీటీడీ వెల్లడించింది.