NTV Telugu Site icon

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. నేడు అంగప్రదక్షిణం దర్శన టిక్కెట్లు విడుదల

Tirumala

Tirumala

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇవాళ అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల చేయనున్నారు. మే నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను నేడు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. అంతేకాదు మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారి కోటా టోకెన్లు విడుదల చేయనున్నారు. అలాగే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి గదులు, శ్రీవారి సేవ కోటా టోకెన్లు రిలీజ్ చేస్తారు. తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత‌ ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను నేటి మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

Read Also: Bramayugam Review: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ‘భ్రమ యుగం’ రివ్యూ!

అలాగే, మే నెల‌కు సంబంధించిన మరోవైపు రేపు ( ఫిబ్రవరి 24న) ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేస్తోంది. తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌పైనా క్లారిటీ కూడా ఇచ్చారు. తిరుమల, తిరుపతిల‌లో మే నెల గదుల కోటాను రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఫిబ్రవరి 27న శ్రీవారి సేవ కోటా విడుదల చేయనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ, మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు న‌వ‌నీత సేవ, మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప‌ర‌కామ‌ణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేయనున్నారు.