Site icon NTV Telugu

Alampur Ex Mla Joins in BRS: బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే

Kcr Brs

Kcr Brs

ఇవాళ తెలంగాణ చరిత్రలో మరో ఘట్టం ఆవిష్కృతమయింది. ఇవాళ్టి వరకూ కేవలం తెలంగాణకే పరిమితం అయిన టీఆర్ఎస్ పార్టీ అధికారికంగా బీఆర్ఎస్ గా రూపాంతరం చెందింది. దీంతో గులాబీ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథాన నడిపిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిపిన, అధినేత సిఎం కేసీఆర్ నేతృత్వంలో ఆవిర్భవించిన బిఆర్ఎస్ పార్టీ, దేశ రాజకీయాల్లో వో సంచలనంగా మారింది. జాతీయ రాజకీయాల్లో చర్చకు దారితీసిన బిఆర్ఎస్ పార్టీ గుణాత్మక జాతీయ విధానాలు, ఇప్పటికే పలువురు రాజకీయ వేత్తలను, మేథావులను ఆకర్షిస్తున్నవి. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు పలువురు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇందులో పలువురు సీనియర్ రాజకీయ నేతలు మేథావులు ప్రజాక్షేత్రంలో పనిచేసే పలువురు ప్రముఖులున్నారు. ఈ నేపథ్యంలో.. శుక్రవారం నాడు బిఆర్ఎస్ జాతీయ పార్టీ గా, అధికారికంగా ఆవిర్భవించిన కొన్ని గంటల్లోనే పార్టీలో చేరికలు ప్రారంభమయ్యాయి.

అలంపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేపథ్యం వున్న ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి సీనియర్ రాజకీయవేత్త చల్లా వెంకట్రామిరెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. జిల్లా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి, చల్లా వెంకట్రామిరెడ్డిని బిఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా…మంత్రి హరీశ్ రావు తదితరులు ఆయనకు పార్టీలోకి ఆహ్వానం పలికారు..చురుకైన రాజకీయ నాయకుడు చల్లా వెంకట్రామిరెడ్డికి పార్టీలో తగు స్థానం కల్పించి, ఆయన సేవలను బిఆర్ఎస్ పార్టీ కోసం జాతీయ స్థాయిలో వినియోగించుకుంటామని సిఎం కేసీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా సిఎం ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ జాతీయ విధానాలు నచ్చి తాను బిఆర్ఎస్ పార్టీలో చేరానన్నారు వెంకట్రామిరెడ్డి. పార్టీ ప్రకటన తర్వాత మొట్టమొదటి చేరిక తనదే కావడం తనకు సంతోషంగా వుందని చల్లా’ తెలిపారు. అధినేత ఆదేశాలను అనుసరిస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని చల్లా వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు.

Read Also: NRI Smitha Reddy Joins In Bjp: బీజేపీలోకి ఎన్నారై స్మితారెడ్డి.. కండువా కప్పిన బండి సంజయ్

అలంపూర్ నియోజకవర్గానికి చెందిన చల్లా వెంకట్రామిరెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా ప్రాంతంలో రాజకీయంగా పట్టువున్న మంచి పేరున్న సీనియర్ రాజకీయ కుటుంబానికి చెందిన వారు. ఈయన, భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి స్వయానా మనవడు (కూతురు కొడుకు). ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రేస్ హయాంలో మాజీ మంత్రి గా పనిచేసిన సీనియర్ రాజకీయ నాయకుడు స్వర్గీయ చల్లా రాంభూపాల్ రెడ్డి వీరి తండ్రి. చల్లా చేరికతో జిల్లాల్లో బీఆర్ఎస్ మరింతగా పటిష్టం అవుతుందని అంటున్నారు.

Read Also: Pawan Kalyan: ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్న పవన్.. 20 ఏళ్ల తర్వాత ఇలా

Exit mobile version