Akshay Kumar: అక్షయ్ కుమార్ కుమార్తెకు సైబర్ వేధింపులు.. నిందితుడు అరెస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కుమార్తె నిత్తారా (Nitara) సైతం వేధింపులకు గురికావడం సంచలనం సృష్టించింది. గత ఏడాది నుంచి సాగుతున్న ఈ కేసులో మహారాష్ట్ర సైబర్ పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర సైబర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADG) యశస్వి మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో నిందితుడిని పట్టుకోవడంలో అక్షయ్ కుమార్ కుమార్తె చూపిన ధైర్యం కీలకమని పోలీసులు తెలిపారు. “ఆమె ధైర్యంగా ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడం వల్లే మేము నిందితుడిని పట్టుకోగలిగాము. ఇలాంటి విషయాల్లో పిల్లలు మౌనంగా ఉంటే నేరగాళ్లు మరింత రెచ్చిపోతారు” అని అధికారులు పేర్కొన్నారు.
గతంలో ముంబైలో జరిగిన ‘సైబర్ అవేర్నెస్ మంత్ 2025’ కార్యక్రమంలో అక్షయ్ కుమార్ ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టారు. తన కుమార్తె ఆన్లైన్లో గేమ్ ఆడుతున్న సమయంలో ఒక అపరిచితుడు ఆమెకు మెసేజ్‌లు పంపాడని, అసభ్యకరమైన ఫొటోలు (Nude Photos) పంపాలని వేధించినట్లు తెలిపారు. అయితే, ఆ చిన్నారి భయపడకుండా వెంటనే ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడం విశేషం. అక్షయ్ కుమార్ వెంటనే సైబర్ క్రైమ్ అధికారులను ఆశ్రయించడంతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని ట్రేస్ చేసి పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, అక్షయ్ తీసుకున్న చొరవపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read
- 12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
- Truecaller Scam Checker: ఆన్లైన్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు Truecaller కొత్త ఫీచర్.. నంబర్, లింక్, మెసేజ్ అన్నీ ఒకేచోట చెక్..
తాజావార్తలు
-
Share Nani Tag: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Bloody Romeo : నాని సరసన నాజూకు బ్యూటీ..
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!