Manam : టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఫ్యామిలీస్ లో అక్కినేని కుటుంబం ఒకటి.అక్కినేని నాగేశ్వరరావు గారు తన సినీ కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించి చరిత్ర సృష్టించారు.టాలీవుడ్ లో ఒక లెజెండరీ స్టార్ గా నిలిచిపోయారు.ఆయన వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తన తండ్రి లెగసిని కొనసాగించారు.ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు.ఇక అక్కినేని మూడోతరం వారసులుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య ,అఖిల్ ఎంతో సక్సెస్ఫుల్ గా వారి సినీ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ మూడు తరాల వారు కలిసి నటించిన క్లాసిక్ మూవీ “మనం”..
ఈ సినిమా 2014 మే 23 న రిలీజ్ అయి అద్భుత విజయం సాధించింది.అక్కినేని నాగేశ్వరరావు గారి చివరి సినిమాగా “మనం” సినిమా నిలిచిపోయింది.ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, సమంత మరియు శ్రేయ కీలక పాత్రల్లో నటించారు.ఈ మూవీ విడుదలై పదేళ్లు అవుతున్న సందర్భంగా ఈ సినిమాని ఈ నెల మే 23 న మరోసారి థియేటర్స్ కు తీసుకు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో పలు థియేటర్స్ లో ఈ సినిమా స్పెషల్ షో లు వేయనున్నారు.హైదరాబాద్ లో దేవి 70mm థియేటర్ ,వైజాగ్ లోని శరత్ థియేటర్ ,విజయవాడలోని స్వర్ణ మల్టీప్లెక్స్ లో ఇప్పటికే బుకింగ్ ప్రారంభం అయినట్లు ఓ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది.