Akhil Raj Incident: నాదే తప్పు.. హీరోను ఏం అనకండి.. డెలివరీ బాయ్ షాకింగ్ స్టేట్మెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhil Raj Incident: ఇటీవల సోషల్ మీడియాలో అత్యంత వివాదాస్పదంగా మారిన టాలీవుడ్ హీరో అఖిల్ రాజ్, ఫుడ్ డెలివరీ బాయ్ వివాదం ఊహించని మలుపు తిరిగింది. మొదట్లో డెలివరీ బాయ్‌పై నెటిజన్లు చూపించిన సానుభూతి, సదరు హీరోపై వచ్చిన ట్రోలింగ్స్ అన్నింటికీ తెరదించుతూ సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి బాధ్యత తనదేనంటూ సదరు డెలివరీ బాయ్ స్వయంగా మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఒక టీవీ ఇంటర్వ్యూలో సదరు డెలివరీ బాయ్ మాట్లాడిన వివరాల ప్రకారం.. అసలు గొడవంతా ఒక రాంగ్ అడ్రస్ డెలివరీతోనే మొదలైంది. ఆర్డర్‌ను లొకేషన్ సరిగ్గా చూసుకోకుండా, అఖిల్ రాజ్ నివసించే అపార్ట్‌మెంట్‌కు ఎదురుగా ఉన్న మరో బిల్డింగ్‌లో ఇవ్వాల్సి ఉండగా అది అఖిల్ రాజ్ ఇంటికి డెలివరీ ఇచ్చాడు. సుమారు 20 నిమిషాల తర్వాత పొరపాటు గ్రహించి వెనక్కి వచ్చిన క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నడిచింది.
పైగా, సదరు హీరో కుటుంబం పూర్తిగా శాకాహారులు (బ్రాహ్మణులు) కావడంతో, వారి ఇంట్లోకి నాన్‌వెజ్ ఆర్డర్ రావడం వారిని తీవ్రంగా కలచివేసింది. ఈ క్రమంలోనే హీరో తల్లి సదరు డెలివరీ బాయ్‌ని ప్రశ్నించగా, ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. ఆమె అసలు చదువుకున్నావా అని అడగడంతో డెలివరీ బాయ్ కాస్త సహనాన్ని కోల్పోయినట్లుగా వెల్లడించాడు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
అసలు భయం ఇదే!
గతంలో తనకు జరిగిన ఒక రోడ్డు ప్రమాదం కారణంగా దౌడ భాగంలో తీవ్రమైన గాయమైందని, ఆ పాత భయంతోనే హీరో తనపై దాడి చేస్తాడేమోనని కంగారుపడ్డానని డెలివరీ బాయ్ పేర్కొన్నాడు. కేవలం తన ఆత్మరక్షణ కోసమే ఫోన్ తీసి వీడియో రికార్డు చేశానని, అంతేకానీ ఎటువంటి సింపతీ కోసమో, పబ్లిసిటీ కోసమో చేయలేదని స్పష్టం చేశాడు. “ఆ రోజు నా పుట్టినరోజు కావడంతో తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నాను. పోలీస్ స్టేషన్‌కు వెళ్ళినప్పటికీ ఆవేశం ఆపుకోలేక ఆ వీడియోను నా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసేశాను. కానీ అది ఇంత పెద్ద రచ్చ అవుతుందని, సదరు హీరో అంతగా బద్నాం అవుతాడని నేను ఊహించలేదు.” అని డెలివరీ బాయ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
హీరో అని తెలియకే?
సదరు హీరో నటించిన పాటలకు డెలివరీ బాయ్ గతంలోనే తన భార్యతో కలిసి ఇన్‌స్టా రీల్స్ చేసినట్లు నెటిజన్లు గుర్తించారు. దీనిపై స్పందిస్తూ—”సినిమాల్లో చూసే రూపానికి, ఆ సమయంలో లైవ్‌లో ఆయన ఉన్న లుక్‌కి చాలా తేడా ఉంది. అందుకే ఆయన సెలబ్రిటీ అనే విషయం నాకు అసలు గుర్తుకు రాలేదు. పైగా మిడిల్ క్లాస్ ఆలోచనల ప్రకారం హీరోలు ఇలాంటి అపార్ట్మెంట్లలో ఉంటారని నేను అనుకోలేదు. ఉదయాన్నే వెళ్లి వీడియో డిలీట్ చేసి సారీ చెబుదామనుకునే లోపే అంతా వైరల్ అయిపోయింది” అని క్లారిటీ ఇచ్చాడు. తల్లి ఉమ్మి వేసిందన్న ఆరోపణల్లో కూడా వాస్తవం లేదని, ఇప్పుడు తవ్వుకుంటూ పోతే తప్పులన్నీ తనవైపే వస్తాయని ఒప్పుకున్నాడు డెలివరీ బాయ్
డెలివరీ బాయ్స్ కు కీలక విజ్ఞప్తి
ఈ వివాదం వైరల్ కావడంతో తోటి డెలివరీ బాయ్స్ భారీ సంఖ్యలో హీరో అఖిల్ రాజ్ ఇంటి ముట్టడికి ప్రయత్నించడం, కారు అద్దాలు పగులగొట్టేందుకు యత్నించడం సంచలనం సృష్టించింది. దీనిపై సదరు డెలివరీ బాయ్ స్పందిస్తూ తాను ఎవరినీ రెచ్చగొట్టలేదని, గ్రూపుల్లో మెసేజ్‌లు పెట్టలేదని చెప్పాడు. చివరగా పబ్లిక్కు, తోటి డెలివరీ బాయ్స్‌కు విజ్ఞప్తి చేస్తూ—”ఈ ఘటనలో ఇద్దరి తప్పు ఉంది, కానీ ఎక్కువ తప్పు నాదే. హీరో అఖిల్ రాజ్‌ను, వారి కుటుంబాన్ని బూతులు తిట్టడం, ట్రోల్ చేయడం దయచేసి ఇప్పుడైనా ఆపేయండి. నా తప్పును నేను బహిరంగంగా ఒప్పుకుంటున్నాను. ఆయన నాపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకున్నా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను” అంటూ ముగించాడు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?