Lenin : ‘లెనిన్’ షూటింగ్ పూర్తి చేసిన అఖిల్.. కానీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘లెనిన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నందు (మురళీ కిషోర్ అబ్బూరి) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. అఖిల్ తన పాత్రకు సంబంధించిన మేజర్ షూటింగ్ పార్ట్‌ను ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. అయితే, కొన్ని ప్యాచ్ వర్క్ సీన్ల కోసం వచ్చే నెలలో మరోసారి ఆయన సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో, ముఖ్యంగా చిత్తూరు ప్రాంత నేపథ్యంతో సాగే ఈ సినిమాపై అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.
Also Read : Dhurandhar : ‘ధురంధర్’ లో తమన్నాను డైరెక్టర్ ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..
Also Read
- Iran Oil: భారత్‌పై ఇరాన్ ఆశలు.. సముద్రంలో భారీగా చమురు..
- Monsoon: రుతుపవనాలపై ఐఎండీ శుభవార్త.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
- Bharat tiwari: బీహార్‌ను కుదిపేస్తున్న భరత్ తివారీ ఎన్కౌంటర్.. పోలీసులపై ఎఫ్ఐఆర్.
ఈ సినిమాలో అఖిల్ సరసన టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ‘ఏజెంట్’ వంటి భారీ యాక్షన్ చిత్రం తర్వాత అఖిల్ చేస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందని, ఈ చిత్రంతో అఖిల్ ఖచ్చితంగా పెద్ద హిట్ కొడతారని టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్యాచ్ వర్క్‌ను శరవేగంగా పూర్తి చేసి, సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Iran Oil: భారత్‌పై ఇరాన్ ఆశలు.. సముద్రంలో భారీగా చమురు..
-
Monsoon: రుతుపవనాలపై ఐఎండీ శుభవార్త.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
-
Padma Awards: దిగ్గజాలకు పద్మ పురస్కారాలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదానం!
-
Sanjeev Bikhchandani: ఒక్క నిర్ణయం.. వేల కోట్ల సామ్రాజ్యం! నౌక్రీ.కామ్ బాస్ ఇన్వెస్ట్మెంట్ మ్యాజిక్ చూశారా?
ట్రెండింగ్
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?