టాలీవుడ్‌లో ప్రజంట్ మంచి హిట్ కోసం తాపత్రేయపడుతున్న యంగ్ హీరోలో అఖిల్ ఒకరు. ప్రస్తుతం తన ఆశలన్నీ ‘లెనిన్’ సినిమాపైనే పెట్టుకున్నాడు. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరి (నందు) దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో, ముఖ్యంగా చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో సాగుతుంది. ఇందులో అఖిల్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. అఖిల్ – భాగ్యశ్రీ మధ్య వచ్చే లవ్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. అఖిల్ ఈ ప్రాజెక్ట్‌పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. అయితే తాజాగా..
Also Read : Dandora OTT: ‘దండోరా’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఒక ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందని, సినిమా పట్ల తాము చాలా హ్యాపీగా ఉన్నామని తెలిపారు. ఈ సినిమాతో అఖిల్ కచ్చితంగా భారీ హిట్ కొట్టబోతున్నాడంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఈ చిత్రంలో ఒక హీరోయిన్ చిన్న అతిథి పాత్రలో మెరవబోతోందని కూడా ఆయన రివీల్ చేశారు. నిర్మాత మాటలు వింటుంటే ఈసారి అఖిల్ బాక్సాఫీస్ వద్ద గట్టిగానే సందడి చేసేలా ఉన్నాడు. మరి ‘లెనిన్’ తో అఖిల్ తన హిట్ కల నెరవేర్చుకుంటాడో లేదో చూడాలి!
