NTV Telugu Site icon

Akhil Akkineni : అక్కినేని ఇంటి పేరు నాకు వద్దు.. ఆ బరువు మోయాలేకపోతున్నా

Akhil Faria Abdulla

Akhil Faria Abdulla

Akhil Akkineni : అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు అఖిల్.. గతంలో తాను నటించిన సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద పెద్దగా ఆడలేదు. తన ఆశలన్నీ తాజాగా నటించిన సినిమాపైనే పెట్టుకున్నాడు. అఖిల్ లేటెస్ట్ సినిమా ఏజెంట్. ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్ తో ఇప్పటికే అఖిల్ తన సత్తా చూపించాడు. ఇక తన యాక్షన్ సన్నివేశాల్లో ఫుల్ ఎనర్జీ పెట్టినట్లు కనిపిస్తోంది. రీసెంట్ గా రిలీజ్‌ అయిన రెండు నిమిషాల ఇరవై సెకండ్ల ట్రైలర్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేస్తుందని అఖిల్ గట్టి నమ్మకంగా ఉన్నారు. ఈ మూవీ ఏప్రిల్ 28 వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక సినిమా ప్రమోషన్ లో చిత్రబృందం బిజీగా ఉన్నారు.

Read Also: Meena Daughter : కూతురు మాటలకు బోరున ఏడ్చేసిన మీనా

ఏజెంట్ మూవీ ప్రమోషన్‌లో భాగంగా హీరో అఖిల్ తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను అక్కినేని వారసుడిగా పని చేయను.. నేను అఖిల్‌గా ముందుకెళ్తా. అక్కినేని పేరు ఉంటే.. ఒకే తరహాలో సినిమాలు చేయాలి. వారసత్వం అనేది నాపై బర్డన్‌గా ఉంటుంది. ప్రజలు నన్ను అఖిల్‌గానే ఓన్ చేసుకోవాలి. దాని కోసమే నేను ప్రయత్నిస్తూ ఉన్నా. నేను నా సొంత నిర్ణయాలని తీసుకుంటున్నాను. సక్సెస్ లు వచ్చినా ఇంకా ఫెయిల్యూర్ లు వచ్చినా చివరి దాకా నాలాగే ఉండేందుకు నేను ప్రయత్నిస్తాను అని చెప్పుకొచ్చాడు ’ అఖిల్. ఇక ఏజెంట్ సినిమాతో అఖిల్ ఎలాంటి హిట్ ని అందుకుంటాడో చూడాలి.

Read Also: Kattappa : ఖల్ నాయక్ మిస్ చేసుకున్న కట్టప్ప క్యారెక్టర్