Lenin: లెనిన్ హిట్ టాక్.. నాగ్’ను పట్టుకుని ఏడ్చేసిన అఖిల్

Akhil Akkineni Crying

Akhil Akkineni Crying

ఎట్టకేలకు అక్కినేని వారసుడు అఖిల్ ఊరిస్తున్న ఆ సాలిడ్ సక్సెస్ బాక్సాఫీస్ వద్ద దక్కింది. ఎన్నో వాయిదాల తర్వాత ఈరోజే థియేటర్లలోకి వచ్చిన ‘లెనిన్’ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల వద్ద పాజిటివ్ హిట్ టాక్ రావడంతో అక్కినేని క్యాంప్‌లో పండగ వాతావరణం నెలకొంది. కెరియర్ ప్రారంభం నుండి సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్, ఈ సినిమాతో ఒక బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడంతో అక్కినేని కుటుంబంలో భావోద్వేగాలు ఒక్కసారిగా బద్దలయ్యాయి.

సినిమాకు మార్నింగ్ షోల నుంచే పాజిటివ్ రివ్యూస్ వస్తుండటంతో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకలకు అఖిల్ తండ్రి, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిత్ర దర్శకుడు మురళీకృష్ణ నిర్మాత నాగవంశీతో కలిసి నాగార్జున, అఖిల్‌లు అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా కేక్ కట్ చేసి ఈ భారీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సక్సెస్ మీట్‌లో ఒక అద్భుతమైన ఎమోషనల్ సీన్ చోటుచేసుకుంది. ‘ఏజెంట్’ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత రెండేళ్ల పాటు పడిన కష్టం, ఎదుర్కొన్న విమర్శలన్నింటికీ ఈ ‘లెనిన్’ సక్సెస్‌తో సమాధానం దొరకడంతో అఖిల్ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాడు. కేక్ కట్ చేసిన వెంటనే తన తండ్రి నాగార్జునను గట్టిగా పట్టుకుని ఏడ్చేశాడు. కొడుకు కళ్లల్లో ఆనంద బాష్పాలను చూసిన నాగార్జున కూడా అంతే ఎమోషనల్ అవుతూ అఖిల్‌ను దగ్గరకు తీసుకుని వెన్నుతట్టి ఓదార్చారు. ఈ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.