Akhanda 2: నటసింహం నందమూరి బాలకృష్ణ నాలుగేళ్లుగా బాక్సాఫీస్ వద్ద హల్చల్ చేస్తూనే ఉన్నారు. ‘ఢాకూ మహారాజ్’, ‘భగవంత్ కేసరి’, ‘వీర సింహా రెడ్డి’, ‘అఖండ’ వంటి వరుస బ్లాక్ బస్టర్లతో ఆయన తన దూకుడు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు బాలయ్య, బోయపాటి శ్రీను కలయికలో సూపర్ హిట్ అయిన ‘అఖండ’కి సీక్వెల్‌గా ‘అఖండ 2: శివ తాండవం’ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన తాజా సమాచారం ప్రకారం.. ‘అఖండ 2’ మూవీ షూటింగ్ వేగంగా పూర్తవుతోందని తెలుస్తోంది. మే చివరి నాటికి టాకీ పార్ట్ మాత్రమే కాకుండా సగం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా పూర్తి చేయాలని బోయపాటి శ్రీను టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం. సాధారణంగా సీక్వెల్ సినిమాలపై భారీ అంచనాలు ఉండటం సహజమే. కాకపోతే, బోయపాటి ఈ ప్రాజెక్ట్‌ను రాకెట్ స్పీడ్‌లో పూర్తి చేయడానికి ప్రణాళికలు వేసినట్టు సమాచారం.
Read Also: Kavya Kalyani: ‘ఢీ’షో డ్యాన్సర్ కావ్య కల్యాణి ఆత్మహత్య
ఇప్పటికే హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో బాలకృష్ణ, ఆది కాంబినేషన్‌లో కొన్ని సీన్స్‌ను షూట్ చేశారు. ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్ చూసిన బోయపాటి సినిమాపై మరింత శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా, మహాకుంభమేళా సమయంలో సినిమా టీం రియల్ లొకేషన్స్‌లో కొన్ని సీన్స్ షూట్ చేసి వచ్చినట్లు సమాచారం. ఈ మూవీపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగా రియలిస్టిక్ విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రస్తుతం బోయపాటి శ్రీను హిమాలయాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ‘అఖండ’ సినిమా కోసం లొకేషన్లను రెక్కీ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. సినిమాలో హైలైట్ అయ్యే సీన్స్‌ను హిమాలయాల్లో షూట్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ‘అఖండ 2’ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడికానున్నాయి. అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకొన్నారు.