Site icon NTV Telugu

Akhanda 2: ప్రీమియర్స్ కి 10 కోట్లు కలెక్షన్లు!

Akhanda 2

Akhanda 2

Akhanda 2 : నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అఖండ 2: ది తాండవం’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను మొదలుపెట్టింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించగా, ఎం. తేజస్విని నందమూరి సమర్పించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం, అంచనాలకు మించిన స్పందనతో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.

Duvvada, Madhuri : అందుకే పార్టీకి వెళ్లాం.. ఫామ్‌హౌస్‌ పార్టీ వ్యవహారంపై దువ్వాడ, మాధురి క్లారిటీ

సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న నిర్మాత రామ్ ఆచంట మాట్లాడుతూ.. సినిమాకు వచ్చిన స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేశారు. “ప్రీమియర్స్ రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. రాత్రి జరిగిన ప్రీమియర్స్ కలెక్షన్లు నైజాం, సీడెడ్, ఆంధ్ర ప్రాంతాలు కలిపి ₹10 కోట్ల గ్రాస్ చేశాయి. కర్ణాటకలో కూడా దాదాపు కోటి రూపాయలు కలెక్ట్ చేసింది. ప్రీమియర్స్‌లో కోటి రూపాయలు కలెక్ట్ చేసిన నాన్-కన్నడ సినిమాల్లో ‘అఖండ 2’ ఐదో చిత్రంగా నిలవడం మాకు చాలా గర్వకారణం” అని రామ్ ఆచంట తెలిపారు.

Dollar vs Rupee: అల్ టైం కనిష్ఠానికి రూపాయి విలువ.. అసలేం జరుగుతుంది..?

ప్రస్తుతం బుకింగ్స్ చాలా బలంగా ఉన్నాయని, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి అద్భుతమైన రిపోర్ట్స్ వస్తున్నాయని నిర్మాత వెల్లడించారు. “శుక్రవారం ఈవినింగ్ నుంచి ఫ్యామిలీస్ కూడా థియేటర్లకు యాడ్ అవుతాయి. ఈ వీకెండ్‌కు అదిరిపోయే ఫిగర్స్ చూస్తామని మాకు నమ్మకం ఉంది. ఓవర్సీస్ రెస్పాన్స్ కూడా అద్భుతంగా ఉంది. ఈ వీకెండ్‌లో కూడా అది కొనసాగుతుంది. బుకింగ్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి; అన్ని షోలు ఫాస్ట్‌గా ఫిల్లింగ్ అవుతున్నాయి. శని, ఆదివారాల్లో కలెక్షన్లు ఇంకా సూపర్బ్‌గా ఉంటాయి. గ్రౌండ్ రిపోర్ట్ ఎక్సలెంట్ గా ఉంది. డిస్ట్రిబ్యూటర్లు ఫుల్ హ్యాపీగా ఉన్నారు” అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా, బాలయ్య బాబు ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారని, అద్భుతమైన సినిమా తీశారని ప్రశంసిస్తున్నారని రామ్ ఆచంట తెలిపారు. ‘అఖండ 2: ది తాండవం’ చిత్రం విడుదల తర్వాత మేకర్స్ అందరూ సంతోషంగా ఉన్నారు.

Exit mobile version