Akhanda 2 Release Date: అఖండ 2 డేట్ ఫిక్స్! అధికారిక ప్రకటన ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhanda 2 Release Date: ‘అఖండ 2’లో బాలకృష్ణ హీరోగా నటించగా, బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఇందులో సంయుక్త మీనన్ కథానాయికగా నటించింది. ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. తదుపరి తేదీ గురించి అభిమానులు ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే.. విడుదల తేదీపై తాజాగా కీలక ప్రకటన వెలువడింది. రేపటికి (బుధవారం) కోర్టు ఆర్డర్ మేకర్స్ చేతికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఆర్డర్ వచ్చిన వెంటనే సినిమా విడుదలపై అధికారిక ప్రకటన వెలువడనుంది. అయితే.. ఇప్పటికే అభిమానులు ఆగ్రహానికి గురవుతున్న వేళ.. సినిమాను అతి త్వరలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారట. వచ్చే వారం అఖండ 2 ను తెరపై తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారట. ఈనెల 12న సినిమా థియేటర్లలో సందడి చేయనుందనే సమాచారం సైతం అందుతోంది. అయితే.. ఈ రెండ్రోజుల్లో 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ రిలీజ్ తేదీపై అధికారిక ప్రకటన ఇవ్వనుందని తెలుస్తోంది!
READ MORE: Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. 7.6 తీవ్రత.. సునామీ హెచ్చరిక జారీ
Also Read
అఖండ 2 వాయిదాకు కారణాలేంటి..?
అఖండ 2 సినిమా వాయిదా పడటానికి అసలు కారణం సంకేతిక సమస్యలు కాదు. ఈ చిత్ర నిర్మాతలైన రామ్ ఆచంట, గోపి ఆచంట గతంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో 1నేనొక్కడినే, ఆగడు వంటి సినిమాలను బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఎరోస్ నౌ తో బాగస్వామ్యంగా భారీ బడ్జెట్ తో నిర్మించింది. కానీ రెండు సినిమాలు కూడా దారుణంగా ప్లాప్ అయ్యాయి. అప్పటి నుంచి 14 రీల్స్ కు ఈరోస్ నౌ మధ్య ఆర్థిక లావాదేవిలా విషయంలో ఇష్యూ నడుస్తోంది. ఈరోస్ కు రూ. 27. 8 కోట్ల రూపాయలు 14 రీల్స్ బకాయి ఉంది. ఈ వివాదాన్ని పరిష్కరించకుండా 14 రీల్స్ ప్లస్ అని మరొక బ్యానర్ పై సినిమాలు చేస్తున్నారు రామ్ ఆచంట, గోపి ఆచంట. కొన్ని సంవత్సరాలుగా సైలెంట్ గా ఉన్న ఈరోస్ ఇప్పడు అదును చూసి 14 రీల్స్ మేకర్స్ పై మద్రాసు కోర్టులో కేసు వేసింది. ఈ కేసులో కోర్టు తీర్పు ఈరోస్ కు అనుకూలంగా రావడంతో అఖండ 2 రిలీజ్ ఆగింది.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!