NTV Telugu Site icon

Hero Ajith : అజిత్ నెక్ట్స్ మూవీలో త్రిష అవుట్.. కాజల్ ఇన్?

Ajith

Ajith

Hero Ajith Kumar : తమిళ స్టార్ హీరో అజిత్ వరుస సినిమాలో బిజీగా ఉన్నారు. తాజాగా అజిత్ నటించిన తునివు సంక్రాంతి బరిలో ఉండనే ఉంది. అది రిలీజ్ కాగానే వెంటనే తన కొత్త సినిమా ప్రారంభించేందుకు ఈ స్టార్ హీరో ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయినట్లు సమాచారం. అజిత్ తన కెరీర్లో నటిస్తోన్న 62చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. నయనతార భర్త విఘ్నేష్‌ శివన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రంలో హీరోయిన్‌ ఎవరన్నది ఆసక్తిగా మారింది.

Read Also: Movie Banned : అజిత్ సినిమాను బ్యాన్ చేసిన సౌదీ అరేబియా ?

మొదట నయనతార నటించనున్నట్లు ప్రచారం జరిగింది.. కానీ కొన్ని కారణాలతో నయనతార తప్పుకుందని తెలుస్తోంది. అంతకు ముందు నయన్ అజిత్ కాంబినేషన్లో ఆరంభం, విశ్వాసం వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు అజిత్‌ 62వ చిత్రంలో నటి త్రిష నాయకిగా నటిస్తున్నట్లు మరోసారి ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆమె కూడా ఇందులో నటించడం లేదని సమాచారం వైరల్ అవుతోంది. ఈ సినిమాకు కాజల్‌ అగర్వాల్‌ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు వివేకం చిత్రంలో అజిత్‌తో కాజల్ జతకట్టిన విషయం తెలిసిందే. అజిత్‌కు జంటగా నటించే విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం కాజల్‌ అగర్వాల్, కమలహాసన్‌ సరసన ఇండియన్‌–2 చిత్రంలో నటిస్తోంది.

Show comments