వాము గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తెలుగు రాష్ట్రాలలో వాము సాగుచేయడానికి నేలలు అనుకూలంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలుజిల్లాలో ఈపంటను ఎక్కువగా సాగుచేస్తున్నారు.ఇక వాము పంట ఆక్టోబర్ లో సాగుచేయడానికి వీలు ఉంటుది..వాములో రకాల ఎంపిక మొదలు యాజమాన్యంలో మేళకువలు పాటించినట్లయితే ఆధిక దిగుబడులు పొందే ఆవకాశం ఉంటుది.. ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన పంట వాము. వాము సాగులో సమస్యలు తక్కువగా ఉండటం వల్ల రైతులు ఎక్కువగా ఈ పంటను పండిస్తున్నారు..
తెలుగు రాష్ట్రాల్లో కొందరు రైతులు వామును సాగు చేస్తూ లాభాలను అర్జీస్తున్నారు..చల్లని వాతావరణం, మంచు ఈపంట పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. వర్షాధారం క్రింద సాగు చేయదలిస్తే నల్లరేగడి నేలలు అనుకూలం. నీటిపారుదల కింద సాగు చేయదలిస్తే తేలికపాటి నేలలు కూడా అనుకూలం. అధిక ఆమ్ల, క్షార నేలలు, నీరు నిలువ ఉండే నేలలు అనుకూలం కావు… ఈరోజు మనం వాము సాగు గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం..
వాము మొక్క మొత్తం సువాసనతో ఉంటుంది. జీర్ణక్రీయకు కూడా వాము బాగా పనిచేస్తుంది.. వాముమొక్క పువ్వుల నుంచి విత్తనాలు సేకరించబడుతాయి. అంధ్ర, తెలంగాణాలలో కూడా ఈపంటను ఎక్కువగా పండిస్తారు. అంతేకాకుండా మధ్యప్రదేశ్, గుజరాత్ , మహారాష్ర్ట, ఉత్తరప్రదేశ్ రాష్ట్రములో కూడా సాగుచేస్తారు. రబీ సీజన్ లో పండిస్తారు . కొన్ని ప్రాంతాలలో దీనిని ఖరీఫ్ పంటగా కూడా పండిస్తారు.. చల్లని వాతావరణం మంచిదే.. వాము చాలా మంచిది.. అందుకే పిల్లలకు నూరి అదే విధంగా పెద్దవాళ్లకు కూడా జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.. వీటితో పాటు ఎన్నో సమస్యలను నయం చేస్తుంది..వివిధ వంటకాలలో వాడుతాము, చక్రాలు, బిస్కట్స్ మరియు మనము రోజు తినే బజ్జిల తయారీలో కూడా వాముని ఉపయోగిస్తారు. వాము అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. కాబట్టి వాము సాగుతో మనకు అనేక లాభాలున్నాయి.. వ్యవసాయ నిపుణుల సలహా తో పండిస్తే ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి.. అధిక దిగుబడిని పొందవచ్చు..