NTV Telugu Site icon

Pahalgam Terror Attack: ఉగ్రవాదులను ఏరివేయడంలో అజిత్ దోవల్ దిట్ట.. అజిత్ తదుపరి వ్యూహం ఏంటి?

Pahalgam Terror10

Pahalgam Terror10

సౌదీ అరేబియా పర్యటనను ముగించుకుని భారతదేశానికి తిరిగి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోర ఉగ్రవాద దాడి నేపథ్యంలో వెంటనే చర్యలు చేపట్టారు. ఢిల్లీ పాలం విమానాశ్రయంలో దిగిన కొద్ది క్షణాల్లోనే, ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, నాయకులు ప్రస్తుత గ్రౌండ్ రిపోర్టులు, కొనసాగుతున్న భద్రతా కార్యకలాపాలు, ఈ దాడి దౌత్యపరమైన పరిణామాలపై లోతైన చర్చలు జరిపారని ఆయా వర్గాలు తెలిపాయి. భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, బాధితులకు సహాయం అందించడం, ఈ దాడి వెనుక ఉన్నవారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి ఈ తక్షణ స్పందన దేశ ప్రజలకు భరోసాను ఇస్తోందని చెప్పవచ్చు. ఈ సమావేశం ద్వారా, భారత ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు తన సంసిద్ధతను, దృఢ నిశ్చయాన్ని కలిగి ఉందని స్పష్టం చేసింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వ్యూహంపై ఆసక్తి నెలకొంది. పాక్ ప్రభుత్వం, ఉగ్ర కార్యకలాపాలపై ఆయనకు మంచి పట్టుంది. ఉగ్రవాదులను ఏరివేయడంలో అజిత్ దిట్ట. ఆయన నెక్ట్స్ ప్లాన్ ఏంటని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

READ MORE: AP 10th Results 2025: పదో తరగతి ఫలితాల్లో సంచలనం.. తొలిసారిగా 600కు 600 మార్కులు

ఎవరీ అజిత్ దోవల్..?
అజిత్ దోవల్.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. యుద్ద వ్యూహాల్లో దిట్ట అయిన దోవల్.. ప్రస్తుతం పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు. గతంలో అనేక ఆపరేషన్లలో చాకచక్యంగా నిర్వహించిన దోవల్.. ఇప్పుడు కూడా అదే రీతిలో వ్యూహాలతో ముందుకు సాగనున్నారు. ఐపీఎస్ అధికారి అయిన దోవల్ గతంలో భద్రతాపరమైన చాలా ఆపరేషన్లను స్వయంగా నిర్వహించారు. భారత ఇంటెలీజెన్స్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిగా కూడా ఆయన పని చేశారు. 1988 పంజాబ్‌లోని అమృత్‌సర్‌ నగరంలోని ఒక ప్రార్థనామందిరంలోని ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతాదళాలు ఆపరేషన్‌ బ్లాక్‌థండర్‌ను ప్రారంభించాయి. అయితే ఉగ్రవాదులు ఎందరు ఉన్నారో అంతుబట్టడం లేదు. ఆ సమయంలో ఐపీఎస్‌ అధికారి అయిన దోవల్.. రిక్షా కార్మికుని వేషంలో లోపలికి వెళ్లి ఉగ్రవాదులకు నచ్చజెప్పి భద్రతాదళాలకు లొంగిబోయేలా చేశారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది.

READ MORE: Pahalgam Terror Attack : పహల్గాం ఉగ్రదాడి.. ఆ సినిమా బ్యాన్..?

మౌనంగా తనపనిని తాను చేసుకొని వెళ్లే దోవల్‌ వ్యూహాల్లో దిట్ట. పాక్‌ను ఏకాకి చేసేందుకు ఆయన అంతర్జాతీయంగా అన్నియత్నాలు ప్రారంభించారు. గతంలో పాక్‌లోని భారత దౌత్యకార్యాలయంలో సిబ్బందిగా ఏడు సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించారు. సంక్లిష్ట సమయాల్లో ఆయన తీసుకునే నిర్ణయాలు దేశానికి కీలకంగా మారుతున్నాయి. పఠాన్‌కోట్‌పై పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు చేస్తున్న సమయంలో వారిని ఏరివేసే యత్నాల్లో వున్న భద్రతాదళాలను సమన్వయపరిచారు.