NTV Telugu Site icon

Ajit Doval: మూడోసారి జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్.. పదవీకాలం పొడిగిస్తూ ఉత్తర్వులు

Pakisthn Mp (1)

Pakisthn Mp (1)

మాజీ ఐపీఎస్ అధికారి అజిత్ దోవల్‌ను మూడోసారి జాతీయ భద్రతా సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అజిత్ దోవల్ మూడోసారి జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. 2014లో అజిత్ దోవల్‌కు జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతలు అప్పగించారు. 2019లో కూడా ఆయన పదవీకాలం కొనసాగింది.

READ MORE: Yediyurappa: పోక్సో కేసులో మాజీ సీఎం యడియూరప్పకి అరెస్ట్ వారెంట్ జారీ..

ఎవరీ అజిత్ దోవల్..?
అజిత్ దోవల్.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. యుద్ద వ్యూహాల్లో దిట్ట అయిన దోవల్.. ప్రస్తుతం పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు. గతంలో అనేక ఆపరేషన్లలో చాకచక్యంగా నిర్వహించిన దోవల్.. ఇప్పుడు కూడా అదే రీతిలో వ్యూహాలతో ముందుకు సాగనున్నారు. అందుకే ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరమే దోవల్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు నరేంద్ర మోడీ.

ఐపీఎస్ అధికారి అయిన దోవల్ గతంలో భద్రతాపరమైన చాలా ఆపరేషన్లను స్వయంగా నిర్వహించారు. భారత ఇంటెలీజెన్స్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిగా కూడా ఆయన పని చేశారు. 1988 పంజాబ్‌లోని అమృత్‌సర్‌ నగరంలోని ఒక ప్రార్థనామందిరంలోని ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతాదళాలు ఆపరేషన్‌ బ్లాక్‌థండర్‌ను ప్రారంభించాయి. అయితే ఉగ్రవాదులు ఎందరు వున్నారో అంతుబట్టడం లేదు. ఆ సమయంలో ఐపీఎస్‌ అధికారి అయిన దోవల్.. రిక్షా కార్మికుని వేషంలో లోపలికి వెళ్లి ఉగ్రవాదులకు నచ్చజెప్పి భద్రతాదళాలకు లొంగిబోయేలా చేశారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది.

READ MORE: Bridal Shower Party : పెళ్లికి ముందు జరిగే బ్రైడల్ షవర్ పార్టీ అంటే ఏమిటి? ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

2014లో నరేంద్ర మోడీ ప్రధానిగా అధికారం చేపట్టిన వెంటనే అజిత్‌దోవల్‌ను జాతీయ భద్రతాసలహాదారుగా నియమించారు. ఉత్తరాఖండ్‌కు చెందిన మాజీ ఐపీఎస్‌ అధికారి దోవల్‌. కేరళతో పాటు ఈశాన్యరాష్ట్రాల్లో ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు. మౌనంగా తనపనిని తాను చేసుకొని వెళ్లే దోవల్‌ వ్యూహాల్లో దిట్ట. పాక్‌ను ఏకాకి చేసేందుకు ఆయన అంతర్జాతీయంగా అన్నియత్నాలు ప్రారంభించారు. గతంలో పాక్‌లోని భారత దౌత్యకార్యాలయంలో సిబ్బందిగా ఏడు సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించారు. సంక్లిష్ట సమయాల్లో ఆయన తీసుకునే నిర్ణయాలు దేశానికి కీలకంగా మారుతున్నాయి. పఠాన్‌కోట్‌పై పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు చేస్తున్న సమయంలో వారిని ఏరివేసే యత్నాల్లో వున్న భద్రతాదళాలను సమన్వయపరిచారు.