Aishwarya Rajesh: ‘సంక్రాంతికి వస్తున్నాం’ లానే ‘కలర్స్’ కూడా బ్లాక్‌బస్టర్ కావాలి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఫేమ్ ఐశ్వర్య రాజేష్ ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ ‘కలర్స్’ బంజారా హిల్స్ బ్రాంచ్ లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ యూనిట్‌ని ప్రారంభించింది. ఆధునిక టెక్నాలజీతో ఈ సంస్థ అందిస్తున్న సేవలను ఐశ్వర్య రాజేష్ స్వయంగా పరిశీలించింది. ఇక ఈ క్రమంలో ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ హెల్త్ కేర్ ఎంతో ముఖ్యమని, ఈ సేవలను ఎంతో నాణ్యంగా, ఆధునిక టెక్నాలజీతో అందిస్తున్న ‘కలర్స్’ సంస్థ నిర్వాహకులను అభినందించింది. ప్రతి ఒక్కరూ అందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాము, అలాంటి సేవలను అందిస్తూ ఎంతో మందిని ఆరోగ్యపరంగా సంతృప్తి పరిచిన సంస్థ ‘కలర్స్ హెల్త్ కేర్’ అని అన్నారు. ”లైఫ్‌స్టైల్ బాగుండాలని కోరుకునే వారందరికీ ఈ సంస్థ మెరుగైన సేవలు అందిస్తూ ఇప్పుడు ఆధునిక సాంకేతికతను జోడించుకుని ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’గా ఎదగడం సంతోషం. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ మాదిరిగానే ‘కలర్స్’ కూడా బ్లాక్‌బస్టర్ కావాలి” అని ఐశ్వర్య రాజేష్ ఆకాంక్షించారు.
Rashmi: హాస్పిటల్ బెడ్ పై యాంకర్ రష్మీ..!
Also Read
- Arjun Reedy Ice Scene: 'ఐస్ వేసుకునే సీన్' రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
- Spirit: 'స్పిరిట్'లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
- TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
- 18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
ఇక ‘కలర్స్ హెల్త్ కేర్’ సీవోవో శివాజీ కూన మాట్లాడుతూ.. 2004లో ప్రారంభించిన ‘కలర్స్ హెల్త్ కేర్’ సేవలకు మరింత అడ్వాన్స్ టెక్నాలజీని జోడిస్తూ ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించినట్టు తెలిపారు. ఇప్పటికే 50 బ్రాంచీలు ఉన్న తమ ‘కలర్స్ హెల్త్ కేర్’ను వచ్చే ఏడాది చివరి కల్లా దేశవ్యాప్తంగా 250 బ్రాంచీలకు విస్తరించనున్నట్లు ప్రకటించారు. ఇక ‘కలర్స్ హెల్త్ కేర్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాయుడు మాట్లాడుతూ.. యూఎస్ – ఎఫ్డీఏ అఫ్రూవుడ్ టెక్నాలజీతో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించినట్టు తెలిపారు. ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా అతిథులుగా పాల్గొన్న మినర్వా హోటల్స్ అధినేత, మాజీ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, సీబీఐటీ డైరెక్టర్ దివ్యారెడ్డి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
తాజావార్తలు
-
Arjun Reedy Ice Scene: ‘ఐస్ వేసుకునే సీన్’ రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
-
Spirit: ‘స్పిరిట్’లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
-
TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
-
Varanasi Movie Update: ‘వారణాసి’కి రాజమౌళి డెడ్‌లైన్.. పక్కా ప్లాన్ ప్రకారమే!
-
Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!