NTV Telugu Site icon

Airtel Vs Jio: జియో, ఎయిర్‌టెల్‌ మధ్య పోటీ. కస్టమర్ల కోసం ఆఫర్ల మీద ఆఫర్లు

Airtel Vs Jio

Airtel Vs Jio

Airtel Vs Jio: జియో, ఎయిర్‌టెల్‌ మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ 2 సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాయి. 5జీ యూజర్ల కోసం అన్‌లిమిటెడ్‌ డేటాను అందిస్తున్నాయి. జియో ఇప్పటికే ఈ సర్వీసును ప్రారంభించింది. తాజాగా.. ఎయిర్‌టెల్‌ సైతం ఇదే ప్రకటన చేసింది. పోస్ట్‌ పెయిడ్‌ కస్టమర్లు మరియు 239 రూపాయలు అంతకన్నా ఎక్కువ ప్లాన్లతో రీఛార్జ్‌ చేసుకునే ప్రీపెయిడ్‌ కస్టమర్లు ఇకపై అపరిమితంగా డేటా వాడుకోవచ్చని తెలిపింది.

Startups Fundraising: 8 నెలల కనిష్టానికి ఫండ్‌ రైజింగ్‌

ఇండియాలో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌ అయిన జియో ఇటీవల పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారుల కోసం ఫ్యామిలీతోపాటు వ్యక్తిగత ప్లాన్లను లాంఛ్‌ చేసింది. ఇందులో భాగంగా అన్‌లిమిటెడ్‌ 5జీ డేటా, వైఫై కాలింగ్‌, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ప్రయోజనాలు, ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ సేవలను కల్పిస్తోంది. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌-ఐడియా కస్టమర్లను మరియు తన ప్రీపెయిడ్‌ యూజర్లను ఆకర్షించటం ద్వారా ఆదాయం పెంచుకోవాలని ఈ సర్వీసులకు తెర తీసింది. దీంతో జియో పోటీదారులు దిగిరాకతప్పదని విశ్లేషకులు అన్నారు.

వాళ్లు ఊహించినట్లుగానే ఎయిర్‌టెల్‌ స్పందించింది. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి దేశంలోని అన్ని పట్టణాల్లో, కీలకమైన గ్రామీణ ప్రాంతాల్లో 5జీ సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. వొడాఫోన్‌ ఐడియాని పక్కన పెడితే.. జియో, ఎయిర్‌టెల్‌ మధ్య నెలకొన్న పోటీ వల్ల ఇప్పుడు ఇండియాలో 20 నుంచి 25 మిలియన్లుగా ఉన్న 5జీ యూజర్ల సంఖ్య వచ్చే రెండేళ్లలో 300 మిలియన్‌లకు చేరుకుంటుందని క్రిసిల్‌ రేటింగ్స్‌ సంస్థ అంచనా వేసింది.

Show comments