మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో సమస్యల కారణంగా విమాన సేవలు ప్రభావితమయ్యాయి. చాలా కంపెనీల విమానాలు ఎగరలేకపోతున్నాయి. భారతదేశంలో, ఢిల్లీ, ముంబై మరియు బెంగళూరు విమానాశ్రయాలలో విమానాలు షెడ్యూల్ కంటే ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ సాంకేతిక సమస్యల తర్వాత భారత ప్రభుత్వం మైక్రోసాఫ్ట్‌ను సంప్రదించింది. అనేక దేశాల ప్రభుత్వాలు అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేశాయి. స్పైస్‌జెట్, ఇండిగో మరియు అకాసా ఎయిర్‌లైన్స్ కూడా ఇలాంటి సాంకేతిక సమస్యలను ఉదహరించాయి. ఇండిగో, స్పైస్‌జెట్ వంటి విమానయాన సంస్థలు సర్వర్ సమస్యల కారణంగా సర్వీసులు నిలిచిపోయాయని చెబుతున్నాయి. తాజాగా ఈ సమస్య పరిష్కారమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమస్య వల్ల విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ అంశంపై తాజాగా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అంతరాయం వల్ల ప్రభావితమైన ప్రయాణికులకు నీరు, ఆహారం అందిస్తుందని మంత్రి తెలిపారు.
READ MORE: Atlee: అనంత్ అంబానీ పెళ్లిలో సైలెంటుగా ఆ పని కానిచ్చేసిన అట్లీ!
రామ్మెహన్ నాయుడు తాజాగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఇలా పేర్కొన్నారు. “ప్రయాణికుల పట్ల విమానాశ్రయ అధికారులు, విమానయాన సంస్థలు సానుభూతితో వ్యవహరించాలి. విమాన సర్వీసుల ఆలస్యం కారణంగా ప్రయాణికులకు అదనపు సీటింగ్, వాటర్, ఆహారాన్ని తప్పక అందించాలి. ప్రయాణీకుల సురక్షిత ప్రయాణం కోసం టెక్నికల్ టీమ్ కృషి చేస్తోంది. ఇలాంటి సమాయాల్లో ప్రయాణీకుల సహకారం కూడా తప్పకుండా అవసరం. టెక్నికల్ సమస్య, విమాన సర్వీసుల రాకపోకలపై ఎలాంటి అప్‌డేట్ ఉన్నా ప్రయాణీకులకు వెంటనే తెలియజేయాలి. విమానాశ్రయాల్లో ప్రయాణీకుల అవసరాల కోసం అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశాం. మైక్రోసాఫ్ట్ సంస్థతో అధికారులు టచ్‌లోనే ఉన్నారు. వీలైనంత త్వరగా మామూలు పరిస్థితులు నెలకొంటాయి. ” అని తెలిపారు.