NTV Telugu Site icon

Ayodhya Flight Fare : ఆకాశాన్ని అంటిన విమాన ఛార్జీలు.. అయోధ్యకు వెళ్లేకంటే సింగపూర్ వెళ్లడం నయం

New Project (38)

New Project (38)

Ayodhya Flight Fare : అయోధ్యలో రామ మందిర ప్రారంభానికి ముందు అనేక మార్పులు కనిపిస్తున్నాయి. రామ మందిర నిర్మాణంతో అయోధ్య పునర్వైభవం సంతరించుకుంది. అయోధ్య ఒక ప్రధాన పుణ్యక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా స్థాపించబడుతోంది. ఇదిలా ఉంటే, అయోధ్యకు వెళ్లే విమానాల ఛార్జీలు అనేక అంతర్జాతీయ మార్గాల కంటే ఎక్కువగా ఉన్నాయి.

Read Also:CM Revanth Reddy: యశోద ఆస్పత్రిలో సీఎం.. వెంకట్‌రెడ్డిని పరామర్శించిన రేవంత్ రెడ్డి

జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవానికి ముందే పర్యాటకులు నగరానికి తరలి రావడం ప్రారంభించారు. ఇది విమాన ఛార్జీలపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం ముంబై నుండి అయోధ్యకు జనవరి 19 టిక్కెట్‌ను తనిఖీ చేస్తున్నప్పుడు.. ఇండిగో ఒక విమానానికి ధర రూ. 20,700 చూపుతోంది. అదేవిధంగా జనవరి 20వ తేదీ విమానానికి కూడా దాదాపు రూ.20 వేలు ధర పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇది అనేక అంతర్జాతీయ రూట్లలో ఛార్జీల కంటే ఎక్కువ. ఉదాహరణకు, జనవరి 19న ముంబై నుండి సింగపూర్‌కు వెళ్లే విమానాన్ని తనిఖీ చేసినప్పుడు ఎయిర్ ఇండియా నేరుగా విమానానికి రూ. 10,987గా చూపబడింది. అదేవిధంగా జనవరి 19న ముంబై నుంచి నేరుగా బ్యాంకాక్‌కు వెళ్లేందుకు రూ.13,800గా నిర్ణయించారు.

Read Also:India Maldives Row: మాల్దీవుల రాయబారిని పిలిచిన భారత ప్రభుత్వం

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు, కొత్త విమానాశ్రయం పూర్తయింది. ఈ విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టారు. ఇటీవలే ఈ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రస్తుతం, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో అనే రెండు విమానయాన సంస్థలు మాత్రమే అయోధ్యకు విమానాలను నడుపుతున్నట్లు ప్రకటించాయి.