Site icon NTV Telugu

Venezuela: విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే ఘోరం.. (వీడియో)

Venijula

Venijula

విమాన ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్, మానవ తప్పిదాలతో ఫ్లైట్స్ ప్రమాదానికి గురవుతున్నాయి. తాజాగా వెనిజులాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. గాల్లోకి టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. వెనిజులాలోని టచిరా రాష్ట్రంలోని పారామిల్లో విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక ప్రైవేట్ PA-31 విమానం కూలి పేలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

Also Read:Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో మజ్లిస్ రౌడీయిజం పెరిగింది..!

ప్రమాదానికి గురైన విమానం, ట్విన్-ఇంజన్ పైపర్ PA-31T1, స్థానిక సమయం ప్రకారం ఉదయం 9:52 గంటలకు టేకాఫ్ అయ్యే ప్రయత్నంలో విఫలమైంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నియంత్రణ కోల్పోయి గాల్లో పల్టీ కొట్టి రన్‌వేను ఢీకొట్టి, మంటలు చెలరేగాయి.

Also Read:TDP: వీధిన పడుతున్న టీడీపీ గొడవలు..! హాట్‌ టాపిక్‌గా విజయవాడ ఎంపీ, తిరువూరు ఎమ్మెల్యే వివాదం..

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఏరోనాటిక్స్ (INAC) అత్యవసర, అగ్నిమాపక బృందాలు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాయి. ఈ సంఘటనను దర్యాప్తు చేయడానికి జుంటా ఇన్వెస్టిగడోరా డి యాక్సిడెంట్స్ డి ఏవియాసియన్ సివిల్ (JIAAC) ను ప్రారంభించాయని ధృవీకరించింది. టేకాఫ్ సమయంలో టైర్ పగిలిపోయి ఉండవచ్చని ప్రాథమిక వర్గాలు సూచిస్తున్నాయి, అయితే దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలిపారు.

Exit mobile version