విమాన ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్, మానవ తప్పిదాలతో ఫ్లైట్స్ ప్రమాదానికి గురవుతున్నాయి. తాజాగా వెనిజులాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. గాల్లోకి టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. వెనిజులాలోని టచిరా రాష్ట్రంలోని పారామిల్లో విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక ప్రైవేట్ PA-31 విమానం కూలి పేలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. Also…