NTV Telugu Site icon

Air India: అక్టోబర్ 14 వరకు ఇజ్రాయెల్‌కు విమానాలను రద్దు చేసిన ఎయిరిండియా

Air India

Air India

ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య కొనసాగుతున్న యుద్ధం మధ్య.. ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ కు వెళ్లే తన విమానాలను రద్దు చేసింది. తమ ప్రయాణికులు, సిబ్బంది భద్రత కోసం ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నుండి వెళ్లే ఎయిరిండియా విమానాలను అక్టోబర్ 14 వరకు నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఈ కాలంలో.. ధృవీకరించబడిన బుకింగ్‌లు చేసిన వ్యక్తులందరికీ సాధ్యమైన సహాయం అందించబడుతుందని తెలిపింది. ఇదిలా ఉంటే.. ఎయిరిండియా ప్రతి వారం టెల్ అవీవ్‌కు 5 విమానాలను నడుపుతోంది. అంతకుముందు శనివారం కూడా.. ఫ్లైట్ నంబర్ AI 139, న్యూ ఢిల్లీ నుండి టెల్ అవీవ్ వెళ్లే రిటర్న్ ఫ్లైట్ AI 140 రద్దు చేశారు.

health tips : నీళ్లు ఎక్కువగా తాగితే ఏం జరుగుతుందో తెలుసా..? పొరపాటున కూడా ఈ తప్పు చెయ్యకండి..

అక్టోబర్ 6 శనివారం హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు.. ఇజ్రాయెల్‌లో సుమారు 300 మంది మరణించారు. సుమారు 1590 మంది గాయపడ్డారు. అటు గాజాలో కూడా 232 మంది మరణించారు. 1790 మంది గాయపడ్డారు. గత 24 గంటల్లో 20 మంది చిన్నారులు సహా 256 మంది పాలస్తీనా పౌరులు మరణించారని గాజాలో ఉన్న పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదేకాకుండా.. 1788 మంది పాలస్తీనియన్లు కూడా గాయపడ్డారు.

Virat Kohli Record: అనిల్ కుంబ్లే రికార్డ్ బ్రేక్.. తొలి క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ!

ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హమాస్ దాడికి సంబంధించి యుద్ధం ప్రకటించాడు. శత్రువులు దీనికి భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుందని అన్నారు. ఇజ్రాయెల్ సైన్యం ప్రకారం.. హమాస్ తీవ్రవాదులు గాజా స్ట్రిప్ నుండి 2 వేలకు పైగా రాకెట్లను కాల్చారు. ప్రతిస్పందనగా సైన్యం గాజా నగరం మధ్యలో ఉన్న ఒక టవర్‌ను కూల్చివేసింది. వాయు, సముద్ర సరిహద్దుల్లోని 7 ప్రాంతాల నుంచి హమాస్ చొరబడినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. మరోవైపు గాజా స్ట్రిప్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవాలని కోరుకుంటున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) తెలిపింది. IDF ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ హెచ్ట్ మాట్లాడుతూ.. గాజా స్ట్రిప్‌పై నియంత్రణ సాధించడమే తమ లక్ష్యమని.. తమకు రాబోయే 12 గంటల లక్ష్యం ఉందని తెలిపారు. తాము మొత్తం ప్రాంతాన్ని నియంత్రించాలనుకుంటున్నామని.. తీవ్రవాదులను చంపాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.