Site icon NTV Telugu

Air India: వినియోగదారులకు లేఖ రాసిన ఎయిర్ ఇండియా.. ఏం చెప్పిందంటే..?

Airindia

Airindia

ప్రయాణికుల భద్రతే భద్రతే మాకు ప్రథమ కర్తవ్యమని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. ఎయిర్‌ ఇండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ పేరుతో తమ వినియోగదారులకు లేఖ రాశారు. ఇందులో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా AI171 విమాన ప్రమాదంపై స్పందించారు. అహ్మదాబాద్ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని.. కింద భవనంలో ఉన్న 34 మంది పౌరులూ ప్రమాదంలో మృతి చెందారని లేఖలో పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు మద్దతుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. కేప్టెన్ సుమీత్ సబర్వాల్‌కు 10,000 గంటల ఫ్లయింగ్ అనుభవం కలిగిన నిపుణుడని తెలిపారు. ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్‌కు 3,400 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉందన్నారు.

READ MORE: Kubera : కుబేర బడ్జెట్ ఎంత.. గట్టెక్కుతుందా..?

“విమానం జూన్ 2023లో మెయిన్‌టెనెన్స్‌, డిసెంబర్ 2025 వరకు నెక్స్ట్ చెక్ షెడ్యూల్ ఉంది. రెండు ఇంజిన్లు 2025లో చెక్ చేశారు. ఎటువంటి సాంకేతిక సమస్యలు కనిపించలేదు. డీజీసీఏ ఆదేశాలతో 33 బోయింగ్ 787 విమానాల సేఫ్టీ చెక్స్ ప్రారంభించాం. ఇప్పటి వరకు 26 విమానాలు సేఫ్‌గా క్లియరయ్యాయి. మిగిలినవి చెక్ జరుగుతుంది. ఎయిర్ ఇండియా మెయింటెనెన్స్ ప్రక్రియలు భద్రత ప్రమాణాలకు అనుగుణంగా జరుగుతున్నాయి. మిడిల్ ఈస్ట్ ఎయిర్‌స్పేస్ క్లోజర్లు, నైట్ రిస్ట్రిక్షన్స్ వల్ల విమానాల రద్దు పెరిగింది. జూన్ 20 నుంచి జూలై మధ్యవరకు ఇంటర్నేషనల్ వైడ్‌బాడీ ఫ్లైట్స్‌ను 15% తగ్గిస్తున్నాం. ఫ్లైట్ క్యాన్సల్ జరుగుతున్న సందర్భంలో ప్రయాణికులకు రీఫండ్ లేదా రీబుకింగ్ అవకాశం కల్పిస్తున్నాం. బోయింగ్ 787తోపాటు 777 విమానాలపైనా అదనపు భద్రతా చెక్‌లు కొనసాగుతాయి.” అని లేఖలో ఎయిర్ ఇండియా పేర్కొంది.

READ MORE: Viral Video: పెళ్లిమండపం పైనే కాబోయేవాడికి ముద్దుల వర్షం కురిపించిన పెళ్లి కూతురు..!

Exit mobile version