Site icon NTV Telugu

Operation Sindoor Video: ఆపరేషన్‌ సిందూర్‌లో ఉగ్ర శిబిరాలు ధ్వంసం.. వీడియో విడుదల

Operation Sindoor

Operation Sindoor

Operation Sindoor Video: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే నెలలో ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది ఇండియన్‌ ఆర్మీ.. ఈ ఆపరేషన్‌ ద్వారా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేసింది.. భారత్‌ దెబ్బకు బెంబేలెత్తిన పాకిస్తాన్‌ కాళ్ల బేరానికి రాకతప్పలేదు. మరోవైపు, భారతే యుద్ధం వద్దని దిగువచ్చింది విజయం మనదే అంటూ.. ఆ దేశ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసింది.. అయితే, ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా జరిగిన దాడికి సంబంధించిన వీడియోను భారత వైమానిక దళం (ఐఏఎఫ్) విడుదల చేసింది..

Read Also: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన గోల్డ్ రేట్స్

ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్ట్ చేయబడిన 5 నిమిషాల వీడియోలో మొదట ఏప్రిల్ 22 న జరిగిన పహల్గామ్ ఉగ్రదారికి సంబంధించిన వార్తాపత్రికల క్లిప్పింగ్‌లను చూపించింది, దీనిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ మరియు త్రివిధ దళాల అధిపతులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు చూపించింది. ఇక, ఆ తర్వాత ” ఆపరేషన్ సిందూర్ ” అనే టెక్స్ట్ తో నల్లని బ్యాక్ గ్రౌండ్ కనిపించింది.. తర్వాత ”భాతర వైమానిక దళం ఖచ్చితత్వంతో, వేగంతో, సంకల్పంతో స్పందించింది” అని రాసుకచ్చింది..

Read Also: Karnataka: ఓ టూరిస్ట్ ఓవరాక్షన్.. సెల్ఫీ తీసుకుంటుండగా ఏనుగు దాడి

ఇక, ఆ తర్వాత పాకిస్తాన్ మరియు పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత యుద్ధ విమానాలు జరిపిన వైమానిక దాడులను చూపించింది. “ధ్వంసం చేయబడిన” ఉగ్రవాద శిబిరాలను చూపించే క్లిప్‌లు మరియు చిత్రాలను కూడా ఇందులో పొందుపరిచింది.. 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో యుద్ధ విమానాలు ఎలా పనిచేస్తున్నాయో కూడా ఈ వీడియోలో చూపించారు. 2019లో పుల్వామా దాడికి ప్రతిస్పందనగా కార్గిల్ యుద్ధం మరియు భారతదేశం జరిపిన దాడులను కూడా ఇందులో ప్రస్తావించారు. ఆకాశం చీకటిగా మారి, భూమి లేదా సముద్రంలో ప్రమాదం పొంచి ఉన్నప్పుడు, ఒక శక్తి పైకి లేస్తుంది. విశాలమైనది, నిర్భయమైనది మరియు ఖచ్చితమైనది. భారత వైమానిక దళం,” అని వాయిస్ ఓవర్‌లో వివరించింది.

Read Also: NTR : ఎన్టీఆర్ తప్పించుకున్నాడు, నితిన్ బుక్కైపోయాడు..!

పహల్గామ్ దాడితో సరిహద్దు లింక్‌లను కనుగొన్న తర్వాత భారత సాయుధ దళాలు మే 7న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించాయి . వారు బహుళ ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చాయి.. ఆ తరువాత పాకిస్తాన్ భారీ క్షిపణి మరియు డ్రోన్ దాడిని ప్రారంభించింది, దానిని భారత్‌ విజయవంతంగా తిప్పికొట్టింది.. ప్రతీకారంగా, భారత దళాలు పాకిస్తాన్‌లోని వైమానిక స్థావరాలపై దాడి చేశాయి. దీంతో, వణికిపోయిన పాక్.. కాళ్ల బేరానికి రావడం మే 10న జరిగిన కాల్పుల విరమణతో యుద్ధం ముగిసిన విషయం విదితమే.. కాగా, ఆపరేషన్ సిందూర్ సమయంలో ఐదు పాకిస్తాన్ యుద్ధ విమానాలను మరియు ఒక పెద్ద విమానాన్ని IAF కూల్చివేసిందని ఈ మధ్యే ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ప్రకటించిన విషయం విదితమే..

Exit mobile version