AICC Leader Alleti Maheshwar Reddy Fired on BJP
ధరల పెరుగుదల, (ద్రవ్యోల్బణం ) పై దేశ వ్యాప్తంగా ఆగస్టు 17 నుంచి 23 వరకు నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే.. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో మెహంగై పే చర్చ (ధరల పెరుగుదల పై చర్చలు) నిర్వహిస్తామని వెల్లడించారు. ఆగస్టు 17 నుంచి 23 వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒక రోజు మండీలు, రిటైల్ మార్కెట్లు వంటి తదితర ప్రదేశాల్లో ధరల పెరుగుదల పై ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏఐసీసీ అధ్వర్యంలో ఆగస్టు 28న ఢిల్లీలోని రాంలీలా గ్రౌండ్స్‌లో నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని దేశ స్వాతత్ర్యం కోసం ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు ప్రాణాలు అర్పించారని, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రణాళికలు అమలు చేసి శక్తి వంతమైన భారత దేశాన్ని నిర్మిస్తే…. ఇవాళ బీజీపీ పాలకులు వ్యవస్థలను నిర్విర్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 70 యేండ్లు కాంగ్రెస్ నేతలు కష్టపడి నిర్మించి, కోట్లాది మందికి ఉపాధి చూపించి, దేశ సంపదను సృష్టిస్తే, ఇవాళ మోడీ పదేళ్ల ల్లోనే దేశ ప్రతిష్టను దిగజార్చి, ప్రజా సంపదనంతా దోపిడి దారులకు దోచిపెడుతోందన్నారు. దేశ ప్రజలంతా దేశ భవిష్యత్ కోసం ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.
