Site icon NTV Telugu

Digvijay Singh: కల్వకుంట్ల కుటుంబ అవినీతిపై ప్రజలు విసిగిపోయారు..

Digvijay Singh

Digvijay Singh

Digvijay Singh: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. మార్పు కోసం ఓటేయడానికి సిద్ధం అయ్యారని ఆయన పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజన్‌తోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని.. ఓఆర్‌ఆర్ ఆయన హయాంలోనే వచ్చిందన్నారు. ఐటీలో బెంగళూరుతో హైదరాబాద్ పోటీ పడుతున్నదంటే దానికి కారణం వైఎస్ విజన్, ఆయన నిర్ణయాలే.. హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందిందన్నారు.3 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు ఐటీ సెక్టార్ నుంచే వస్తున్నాయన్నారు. తెలంగాణ బాగు కోసమే సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా దిగ్విజయ్‌ సింగ్‌ వెల్లడించారు.

Read Also: Raja Singh: కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు మోసగాళ్లే.. అబద్దాలు చెప్పడంలో దిట్ట..

దిగ్విజయ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. “తెలంగాణలో ఇంకా విభజన హామీల్లో భాగంగా ఇచ్చిన ప్రాజెక్టులను అమలు చేయాల్సి ఉంది.. వాటిని అధికారంలోకే వస్తే ఫుల్‌ఫిల్ చేస్తాం.. అన్ని వర్గాల బాగు కోసమే సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించారు.. కౌలు రైతులకు న్యాయం జరగడం లేదు.. వారికీ రైతు భరోసాను అందజేస్తాం.. వరికి బోనస్ ఇస్తాం.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయింది.. కల్వకుంట్ల కుటుంబ అవినీతిపై ప్రజలు విసిగిపోయారు.. మధ్యప్రదేశ్‌లో మేము అధికారంలో ఉన్నప్పుడు అన్ని హామీలనూ అమలు చేశాం.. రాజస్థాన్, చత్తీస్ గఢ్, కర్ణాటకల్లో ఇచ్చిన గ్యారెంటీలు, హామీలను అమలు చేశాం.. భారత రాజ్యాంగంలో అన్ని వర్గాలకూ సమ న్యాయం జరిగేలా, వారి బతుకులు బాగుపడేలా అంబేద్కర్ హక్కులు కల్పించారు.. కానీ, ఇప్పుడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని బీజేపీ బలహీనపరుస్తున్నది.. పేదరికం, నిరుద్యోగం భారీగా పెరుగుతున్నది.. రాష్ట్రంలోనూ అలాంటి పరిస్థితే ఉన్నది.. ఎవరూ సంతోషంగా లేరు.. రైతులు, నిరుద్యోగులు అందరూ ఇబ్బందులు పడుతున్నారు.. పేపర్ లీకులతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారు.. ఉద్యోగాలు కల్పించలేదు.. 26/11 దాడుల్లో మరణించిన వారికి నివాళులు.. రాముడు అందరివాడు.. అందరికీ ప్రియమైనవాడు.. అందులో రాజకీయాలేమీ లేవు.‌. కానీ, బీజేపీ మాత్రం దర్మం పేరిట దేవుడిని రాజకీయాలకు వాడుకుంటున్నది.. విభజన రాజకీయాలకు మేము పూర్తిగా వ్యతిరేకం. ” అని దిగ్విజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

 

Exit mobile version