NTV Telugu Site icon

AICC Ajay Kumar : రాజస్థాన్ లో ఈడీ కూడా లంచం అడుగుతుంది..

Telangana Congress

Telangana Congress

ఈడీ, ఐటీ బీజేపీ అనుబంధ సంస్థలుగా పని చేస్తున్నాయని ఏఐసీసీ మీడియా కమిటీ చైర్మన్ అజయ్ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ని ఎదుర్కోవడానిక్ బీజేపీ, బీఆర్‌ఎస్ లు ఎందుకు భయపడుతున్నాయన్నారు. ఈడీ, ఐటీ కాంగ్రెస్ మాత్రమే టార్గెట్ చేస్తున్నాయని, మోడీ ,కేసీఆర్ ఢిల్లీ లో దోస్తి..గల్లీలో కుస్థిలా వ్యవహరిస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్‌, ఏంఐఎం ల మీద ఎందుకు రైడ్స్ జరగడం లేదని ఆయన ప్రశ్నించారు. ఐటీ, ఈడీ, సీబీఐలు బీజేపీ, బీఆర్‌ఎస్ లకు స్టార్ క్యాంపెయినర్‌లా వ్యవహరిస్తున్నారన్నారు.

అంతేకాకుండా.. ‘కాళేశ్వరం లో అవినీతి జరిగిందని పిర్యాదులు వచ్చిన కేసీఆర్ , కేటీఆర్ , బీఆరెస్ నేతల మీద చర్యలు లేవు.. రాజస్థాన్ లో ఈడీ కూడా లంచం అడుగుతుంది.. మోడీ కనుసన్నల్లోనే ఈడీ అధికారులు సైడ్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు.. ఛత్తిస్ ఘడ్ ముఖ్యమంత్రి మీద ఈడీ రైడ్స్ చేసి ప్రెస్ రిలీజ్ చేస్తుంది… కాని సాధారణంగా ఇలా జరగదు.. పారిజాత నర్సింహా రెడ్డి ,జానారెడ్డి ఇళ్లలో , లక్ష్మారెడ్డీ ఇళ్లలో , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలపై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి.. ఖమ్మం లో కాంగ్రెస్ క్లీన్ స్విప్ చేస్తుందనే పొంగులేటి పై ఐటీ రైడ్స్ చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.. కేసీఆర్ బయపడుతున్నాడు కాబట్టే హాట్ లైన్ లో మోడీ తో మాట్లాడి కాంగ్రెస్ నేతల మీద ఐటీ దాడులు జరుగుతున్నాయి.. మా ఎన్నికల యుద్ధం బీజేపీ , బీఆరెస్ తో కాకుండా ఈడీ, ఐటీ తో యుద్ధం చేస్తున్నాం’ అని అజయ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు.