NTV Telugu Site icon

Tamil Nadu: అన్నాడీఎంకే, బీజేపీ మధ్య విభేదాలు.. పొత్తు సంగతేంటి?

Tamilnadu

Tamilnadu

Tamil Nadu: తమిళనాడులో అన్నాడీఎంకే, దాని మిత్ర పక్షం బీజేపీకి మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో పొత్తు ఉంటుందా? లేదా ? అన్నది ఆసక్తి రేపుతోంది. ఐదుగురు బీజేపీ నేతలు అన్నా డీఎంకేలో చేరడంతో మొదలైన వివాదం ముదిరింది. ఒకేసారి 13 మంది బీజేపీ నేతలు పార్టీ వీడటం రాజకీయంగా హాట్ టాఫిక్ గా మారింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై.. తీరు నచ్చక ఆ పార్టీ నేతలు బీజేపీకి గుడ్ బై చెప్పారు. బీజేపీ, అన్నాడీఎంకే కూటమి మధ్య చీలిక వచ్చింది. దీంతో అన్నాడీఎంకే పై అన్నమలై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

2019లో ఈ రెండు పార్టీలూ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగాయి. దాదాపు మూడు ఎన్నికల్లో కలిసే పోటీ చేసినా ఓటమి తప్పలేదు. మొత్తం 234 సీట్లున్న తమిళనాడులో బీజేపీకి నాలుగు స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఇటీవల ఐటి వింగ్ చీఫ్ సిఆర్‌టి నిర్మల్ కుమార్‌తో సహా అనేక మంది బిజెపికి చెందిన నేతలు ఎఐఎడిఎంకెలో చేరారు. దీంతో అన్నాడీఎంకే, బీజేపీ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఏఐఏడీఎంకే ‘సంకీర్ణ ధర్మాన్ని’ ఉల్లంఘిస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. అంతేకాదు అన్నాడీఎంకే అధినేత ఇ పళనిస్వామి దిష్టిబొమ్మను దహనం చేశారు.

Read Also: Delhi: ఢిల్లీ కేబినెట్‌లో చేరిన ఇద్దరు కొత్త మంత్రులు

అయితే, బీజేపీ నేతల చర్యలను అన్నాడీఎంకే ఖండించింది. రాజకీయ నాయకులు పార్టీలు మారడం సాధారణమని పేర్కొంది. గతంలో మాజీ మంత్రి నైనార్ నాగేంద్రన్‌తో సహా పలువురు సీనియర్ నాయకులు బిజెపిలో ఎలా చేరారో ఉదహరించారు. అయితే, ఈ చిన్నచిన్న సమస్యలను పరిష్కరిస్తామని మాజీ మంత్రి డి జయకుమార్‌ తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల వరకు బీజేపీతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. తమిళనాడులో అన్నాడీఎంకే ఎన్డీఏకు సారథ్యం వహిస్తుందని డి జయకుమార్ చెప్పారు.

ఎఐఎడిఎంకె శిబిరంలో మాజీ సీఎంలు పళనిస్వామి, ఓ పన్నీర్‌సెల్వం మధ్య ఆధిపత్యం కోసం గొడవ జరిగింది. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత, అన్నాడీఎంకే మూడు ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో పోటీ చేసి ఓడిపోయింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కూటమి ఓడిపోవడంతో పార్టీలు కలిసి ప్రచారం కూడా చేయలేదు. రాష్ట్రంలో బీజేపీ ఉనికి చాలా తక్కువగా ఉన్నప్పటికీ, పార్టీ తన పాదముద్రను విస్తరించడానికి దూకుడుగా ప్రయత్నిస్తోందని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి.

Show comments