Site icon NTV Telugu

AI Videos: ఏఐ సహాయంతో మహిళ అశ్లీల ఫోటోల సృష్టి.. ఆపై బ్లాక్‌మెయిల్.. చివరకు..?

Ai Videos

Ai Videos

AI Videos: ఉత్తరప్రదేశ్‌ లోని మురాదాబాద్ జిల్లాలో సాంకేతికత దుర్వినియోగానికి సంబంధించిన అత్యంత భయానక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను ఆవరసరాలుకు, మంచిపనులకే కాకుండా నేరాలకు కూడా ఆయుధంగా మారుస్తున్నారు కొందరు దుర్మార్గులు. తాజాగా ఈ కేసు సైబర్ క్రైమ్ రంగంలో పోలీసులకు కొత్త సవాల్‌గా మారింది. ఒక ఫైనాన్స్ ఏజెంట్ ఏఐ సాయంతో ఓ మహిళ జీవితాన్ని నాశనం చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే..

SBI వినియోగదారులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి తగ్గనున్న హోమ్ లోన్స్ EMIలు..!

సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే హర్తలా కాలనీకి చెందిన నిందితుడు.. ముగల్‌పురా ప్రాంతానికి చెందిన యువతిపై ఏఐ సాంకేతికతతో ఫేక్ అశ్లీల ఫోటోలు, వీడియోలు సృష్టించాడు. వాటిని అడ్డం పెట్టుకుని ఆమెను బ్లాక్‌మైల్ చేస్తూ చాలాకాలంగా లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళ ధైర్యం చేసి ప్రతిఘటించగానే.. ప్రతీకారంతో ఆ వ్యక్తి ఎడిట్ చేసిన వీడియోలు, ఫోటోలను బహిర్గతం చేయడమే కాకుండా, ఏకంగా ఆమె మొబైల్ నంబర్‌ను అశ్లీల వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేశాడు.

దీంతో బాధితురాలికి పెద్దెత్తున గుర్తు తెలియని నంబర్ల నుంచి అసభ్యకర కాల్స్ రావడంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది. ఏఐ ద్వారా ఇలాంటి బ్లాక్‌మైలింగ్, దోపిడీపై ఆ జిల్లాలో నమోదు అయిన మొదటి కేసు ఇదేనని పోలీసులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే సైబర్ సెల్‌తో పాటు సివిల్ లైన్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఈ ఘటనకు నేపథ్యం ఒక సాధారణ గృహ అవసరాల కొనుగోలే.

H1b visa: హెచ్1 బీ వీసా దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచే..!

25 ఏళ్ల యువతి తండ్రి, చిన్న కుమార్తె వివాహం కోసం ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ నుంచి వాషింగ్ మెషిన్, ఫ్రిజ్, కూలర్‌ను కంతులపై కొనుగోలు చేశారు. ఆ కంపెనీలో రికవరీ ఏజెంట్‌గా పనిచేసే సంజయ్ సింగ్ నెలవారీ కంతులు వసూలు చేయడానికి వారి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో కుటుంబంతో పరిచయం ఏర్పడింది. దురదృష్టవశాత్తు యువతి తండ్రి క్యాన్సర్‌తో మృతి చెందడంతో కుటుంబం ఆర్థికంగా బలహీనమైంది. ఇదే అవకాశంగా భావించిన నిందితుడు మొదట వేధింపులకు దిగాడు. బాధితురాలు ఎదిరించడంతో ఆమెను ఇరికించేందుకు ఏఐ సాయంతో అశ్లీల వీడియోలు తయారు చేసి వైరల్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Exit mobile version