Agriculture Market Committee : రాష్ట్రవ్యాప్తంగా 11 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాలను మంత్రి తుమ్మల శుక్రవారం ప్రకటించారు.
కొత్తగా నియమించబడిన మార్కెట్ కమిటీలు –
- షాద్ నగర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గాఎ. సులోచన, వైస్ చైర్ పర్సన్ మహ్మద్ అలీఖాన్ నియామకం.
- హుస్నాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా కంది తిరుపతిరెడ్డిని, వైస్ చైర్ పర్సన్ గా బంక ఐలయ్య నియామకం.
- వేములవాడ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా రొండి రాజుని, వైస్ చైర్ పర్సన్ గా కనికరపు రాకేష్ ని నియమించారు.
- మేడిపల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా మధం వినోద్ కుమార్ ని, వైస్ చైర్ పర్సన్ గా మిట్టపల్లి రాజారెడ్డిని నియమించారు.
- రుద్రంగి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా చెలుకల తిరుపతిని, వైస్ చైర్ పర్సన్ గా బొజ్జ మల్లేషంని నియమించారు.
- కథలాపూర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా శ్రీ పూండ్ర నారాయణ రెడ్డి గారిని, వైస్ చైర్ పర్సన్ గా శ్రీమతి పులి శిరీష గారిని నియమించారు.
- కోనరావుపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా శ్రీ కచ్చకాయల ఎల్లయ్య గారిని, వైస్ చైర్ పర్సన్ గా శ్రీ తళ్లపల్లి ప్రభాకర్ గారిని నియమించారు.
- పరిగి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా శ్రీ భూమన్నగారి పరుశురాం రెడ్డి గారిని, వైస్ చైర్ పర్సన్ గా శ్రీ సయ్యద్ అయూబ్ హుస్సేన్ గారిని నియమించారు.
- కల్వకుర్తి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా శ్రీమతి పాక మనీల గారిని, వైస్ చైర్ పర్సన్ గా శ్రీ దేశినేని పండిత్ రావు గారిని నియమించారు.
- ఆమంగల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా శ్రీమతి యాట గీత గారిని, వైస్ చైర్ పర్సన్ గా శ్రీ జి. భాస్కర్ రెడ్డి గారిని నియమించారు.
- వి. సైదాపూర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా శ్రీ దొంత సుధాకర్ గారిని, వైస్ చైర్ పర్సన్ గా శ్రీ న్యాదండ్ల రాజ్ కుమార్ గారిని నియమించారు.
ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 125 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాన్ని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు నూతనంగా ఎన్నికైనా పాలకవర్గ సభ్యులకు అభినందనలు తెలియచేశారు