Agent OTT: ఫ్యాన్స్‌కు శుభవార్త.. ఓటీటీలోకి అఖిల్ ‘ఏజెంట్’ సినిమా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Producer Anil Sunkara Says Agent To Release on Sony LIV Soon: స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ కాంబోలో వచ్చిన సినిమా ‘ఏజెంట్’. ఈ సినిమాలో అఖిల్ సరసన యంగ్ బ్యూటిఫుల్ సాక్షి వైద్య నటించగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. స్పై యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఏజెంట్ బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ అనుకున్నా.. ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. దాదాపు రూ. 85 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ.. థియేటర్లలో కేవలం 8 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టి నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చింది. గతేడాది ఏప్రిల్ నెలలో వచ్చిన ఏజెంట్.. ఇప్పటికీ ఓటీటీ రిలీజ్‌కు నోచుకోలేదు.
ఏజెంట్ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు శుభవార్త. ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ‘సోనీ లివ్’ దక్కించుకున్నట్లు నిర్మాత అనిల్ సుంకర తెలిపారు. సోమవారం (ఎప్రిల్ 8) అఖిల్ పుట్టినరోజు సందర్బంగా ఎజెంట్ నిర్మాత అనిల్ సుంకర శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు. ‘ముందు ఏజెంట్ సినిమాను ఓటీటీలో విడుదల చేయండి’ అంటూ కొందరు ఫాన్స్ కామెంట్లు చేశారు. దాంతో అనిల్ సుంకర స్పందిస్తూ… ‘ఇప్పటికే రెండు సార్లు చెప్పాను. ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ దక్కించుకుంది. అతి త్వరలోనే సినిమా స్ట్రీమింగ్ అవుతుంది’ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
Also Read: NTR Promise: ఇది ఎన్టీఆర్ అంటే.. ఈ ప్రామిస్ అంతకుమించి!
అక్కినేని అందగాడు ‘అఖిల్’.. అఖిల్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అఖిల్ అనంతరం చేసిన హలో, మిస్టర్ మజ్నూ ఆడలేదు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా ఆడినా అది పూజా హెగ్డే ఖాతాలోకి వెళ్లింది. ఏజెంట్ సినిమాతో స్టార్ హీరోగా మారిపోతాడని అనుకున్నా.. అది జరగలేదు. ఇక అఖిల్ తదుపరి మూవీ ఏదన్నది ఇంకా క్లారిటీ రాలేదు. కొత్త దర్శకుడితో సోషియో ఫాంటసీ లవ్ స్టోరీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజావార్తలు
-
India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
-
AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
-
BRICS Summit 2026: మోడీ-జిన్‌పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
-
Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి.. మరో సూపర్‌హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
-
Astrology: సెప్టెంబర్ 13 ఆదివారం దినఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!