Aganampudi Toll Plaza: అగనంపూడి టోల్ ప్లాజా తొలగిస్తాం.. నితిన్ గడ్కరీ హామీ
Aganampudi Toll Plaza: విశాఖపట్నం ప్రజలకు, స్థానికులకు అధిక భారమైన అగనంపూడి టోల్ ప్లాజా తొలగింపుకు పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేయగా.. త్వరలో తొలగిస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు.. పార్లమెంట్‌లో ఈ రోజు జీవీఎల్ మాట్లాడుతూ.. కేవలం ఈ ఏడాదిలోనే హైవేలకు 50000 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. విశాఖపట్నం సిటీ పాత జాతీయ రహదారిపై ఉన్న అగనంపుడి ప్లాజా వలన స్థానిక ప్రజలపై కొన్ని సంవత్సరాలుగా అధిక భారం పడుతుందన్నారు. సబ్బవరం మరియు అనకాపల్లి మధ్య కొత్త జాతీయ రహదారిని ఇప్పటికే నిర్మించినప్పటికీ అగనంపూడి టోల్ ప్లాజా తీసివేయనందు వల్ల విశాఖ ప్రజలపై అదనపు భారం పడుతుందని.. కనీసం స్థానిక ప్రజలకు కూడా ఎలాంటి మినహాయింపు లేదు. ఫలితంగా వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. వీలైనంత త్వరగా చర్యలు చేపట్టి అగనంపూడి టోల్ ప్లాజాను తొలగించాలని కేంద్రాన్ని కోరారు జీవీఎల్..
Read Also: Top Headlines @ 9 PM : టాప్ న్యూస్
Also Read
- Weather Updates in Regional Languages: రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
- Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
- M. K. Stalin: "కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది".. ఎగ్జిట్ పోల్స్‌పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
- Babar Azam: టీ20 క్రికెట్లో నయా హిస్టరీ.. కోహ్లీ, డుప్లెసిస్‌ను వెనక్కి నెట్టేసిన బాబర్ ఆజామ్..
ఇక, జీవీఎల్ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి నిబంధనలను అనుసరించి కాంట్రాక్టర్ కు టోల్ ప్లాజా మంజూరు చేయబడింది. నిబంధనలను అనుసరించి అతనికి ఉన్న కాలపరిమితి ముగియడానికి ముందే దీనిని తొలగించినట్లయితే భారీ స్థాయిలో నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు.. కానీ, జీవీఎల్ లేవనెత్తిన అంశం సహేతుకమైనందువల్ల స్థానిక ప్రజలు ఈ భారాన్ని భరించడం సరి కాదు. వీలైనంత తొందరగా ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపి స్థానిక ప్రజలపై పడే భారాన్ని తొలగిస్తామని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.
విశాఖపట్నం ప్రజలకు, స్థానికులకు అధిక భారమైన విశాఖపట్నం సిటీ పాత జాతీయ రహదారిపై ఉన్న అగనంపూడి టోల్ ప్లాజా తొలిగించాలని ఈరోజు రాజ్యసభ లో డిమాండ్ చేశాను.#AndhraPradesh #vizag #visakhapatnam #gvl #cityofdestiny #TollPlaza #BJPGovernment #BJP4IND pic.twitter.com/e6rfCW1gKO
— GVL Narasimha Rao (@GVLNRAO) February 7, 2024
తాజావార్తలు
-
Weather Updates in Regional Languages: రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
-
NTRNEEL : డ్రాగన్ పార్ట్ – 2 కోసం ఎన్టీఆర్ షాకింగ్ మేకోవర్
-
Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
-
DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్‌మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్పై కీలక ప్రకటన
-
M. K. Stalin: “కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది”.. ఎగ్జిట్ పోల్స్‌పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!