NTV Telugu Site icon

Pravati Parida: మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచి.. డిప్యూటీ సీఎం పదవిని సొంత చేసుకున్న ప్రవతి పరిదా

New Project (13)

New Project (13)

ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ మాఝీ బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో పాటు కొత్త ఒడిశా ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా ఉంటారు. వీరిలో ఒకరు బీజేపీ సీనియర్ నేత కేవీ సింగ్ డియో కాగా, మరొకరు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రవతి పరిదా. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముగ్గురి పేర్లను ప్రకటించారు. ఒడిశాలో తొలిసారిగా బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. బుధవారం జనతా మైదాన్‌లో అంగరంగ
వైభవంగా జరిగే కార్యక్రమంలో కొత్త ముఖ్యమంత్రి, మంత్రి మండలి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

READ MORE: Jammu Kashmir: పుల్వామాలో మూడు దశాబ్దాల తర్వాత తెరుచుకున్న ఆలయ తలుపులు

ఒడిశా కొత్త ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ప్రవతి పరిదాకు తొలిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే కీలక బాధ్యతలు అప్పగించారు. నిమాపర అసెంబ్లీ స్థానంలో బిజూ జనతాదళ్ నాయకుడు దిలీప్ కుమార్ నాయక్‌పై 4,588 ఓట్ల తేడాతో ప్రవతి పరిద విజయం సాధించారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీకి చెందిన సమీర్ రంజన్ దాస్ చేతిలో పరిదా భారీ మెజార్టీతో ఓడిపోయారు. 2014లో పరిదా 29,637 ఓట్లు, 2019లో 32 వేలకు పైగా ఓట్లతో ఓటమి చవిచూశారు. 57 ఏళ్ల పరిదా సామాజిక కార్యకర్తగా తనదైన ముద్ర వేశారు. 1995లో ఉత్కల్ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ చేశారు. తర్వాత 2005లో అదే యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంఏ పట్టా పొందారు. పరిదాపై 9 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. పరిదా కొంతకాలం ఒరిస్సా హైకోర్టులో లా ప్రాక్టీస్ చేశారు. ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. ప్రవిద మొత్తం ఆస్తుల విలువ రూ.3.6 కోట్లు. ఇందులో రూ.2 కోట్ల విలువైన చరాస్తులు కూడా ఉన్నాయి. తన మొత్తం ఆదాయం రూ.31.8 లక్షలుగా ప్రకటించారు. రూ.45 లక్షల అప్పు కూడా ఉన్నట్లు అఫిడవిట్లో ఉంది.