NTV Telugu Site icon

Shruti Hassan: అప్పుడు సిమ్రాన్‌… ఇప్పుడు శ్రుతిహాసన్‌!

Movies

Movies

Shruti Hassan: వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా మారనుంది. ఎందుకంటే బరిలో టాప్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ ఉండటమే. చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ రెండూ బాక్సాఫీస్ బరిలో కొదమసింహాల్లా పోటీ పడనున్నాయి. చిరు సినిమాకు బాబీ దర్శకుడు కాగా బాలయ్య సినిమాకు గోపీచంద్ మలినేని డైరెక్టర్. ఇక ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలలోనూ హీరోయిన్‌గా శ్రుతిహాసన్ నటిస్తుండటం విశేషం.

Blurr Trailer: ఆకట్టుకుంటున్న తాప్సీ ‘బ్లర్’ ట్రైలర్

ఇదిలా ఉంటే 2001లో సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఒకే రోజున విడుదల అయ్యాయి. అవే ‘మృగరాజు, నరసింహనాయుడు’. ఆ రెండు సినిమాలలో హీరోయిన్ సిమ్రాన్ కావటం విశేషం. చిరు సినిమాలో హోమ్లీ క్యారక్టర్ చేసిన సిమ్రాన్ బాలకృష్ణ సినిమాలో గ్లామర్ డాల్ గా కనపించి మురిపించింది. ‘నరసింహనాయుడు’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు 22 సంవత్సరాల తర్వాత ఒకే హీరోయిన్ మళ్ళీ చిరు, బాలయ్య సినిమాల్లో కనిపించనుండటం నిజంగా అరుదైన విశేషం అనే చెప్పాలి. చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’లోనూ, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’లోనూ శ్రుతిహాసనే కథానాయిక. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. నిజానికి శ్రుతిహాసన్ కెరీర్ నీరసంగానే సాగుతోంది. అయితే ‘ప్రేమమ్’ తర్వాత హిట్ లేని శ్రుతిహాసన్ ఖాతాలో 2021లో ‘క్రాక్’ సినిమాతో మంచి హిట్ పడింది. ఆ తర్వాత మళ్ళీ షరా మామూలే. ‘వకీల్ సాబ్’లో నటించినా అంత ప్రాధాన్యమున్న పాత్ర కాదు. ఇప్పుడు శ్రుతిహాసన్ కి మంచి హిట్ కావాలి. మరి చిరు, బాలయ్యలో శ్రుతికి ఎవరు హిట్ ఇస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. వచ్చే ఏడాది ఈ రెండు సినిమాలతో పాటు శ్రుతి నటించిన ప్రభాస్ ‘సలార్’ కూడా విడుదల అవుతుంది. ఈ సినిమాలతో మళ్ళీ శ్రుతి కెరీర్ గాడిన పడుతుందేమో చూడాలి.