సంక్రాంతి తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాల పర్యటన చేపట్టనున్నారు. ప్రతి జిల్లాలో కొన్ని గ్రామాల్లో పర్యటించనున్నారు. గ్రామంలోనే బస చేసి… అక్కడే టెంట్, అదే క్యాంప్ కార్యాలయంగా విధులు నిర్వహిస్తారు. అధికారులు కూడా ఇలాగే గ్రామాల్లో టెంట్‌లో ఉండి ప్రజలకు దగ్గరగా ఉండేలా ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన కార్యాచరణ అధికారులు సిద్ధం చేసినట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదటి పర్యటన ఉండే అవకాశం ఉంది.
READ MORE: Shikhar Dhawan: నాన్నా నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా.. వీడియో వైరల్!
ఇదిలా ఉండగా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు పిఠాపురంలో పర్యటించనున్నారు.. ఈ పర్యటనలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన మినీ గోకులాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 12,500 గోకులాలు ప్రారంభించబోతున్నారు.. ఇక, మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటుచేసిన సాంప్రదాయ సంక్రాంతి వేడుకల్లో పాల్గొని స్టాల్స్ ను పరిశీలించనున్నారు.. గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయంతో పాటు పలు ప్రారంభోత్సవాలు వర్చువల్ గా చేయబోతున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్నారు..
READ MORE: Top Headlines @9AM : టాప్ న్యూస్