Site icon NTV Telugu

Nayanthara: మొన్న సమంత.. నేడు నయనతార..

Nayanthara

Nayanthara

Nayanthara: సోషల్‌ మీడియా తరచుగా సెలబ్రిటీలకు యుద్ధభూమిగా మారుతూ ఉంటుంది. గతంలో సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్న ఫోటో ఒకటి చర్చనీయాంశమైంది. ఆమె అప్పట్లో హైడ్రోజన్ పెరాక్సైడ్, డిస్టిల్డ్ వాటర్ మిశ్రమంతో ఆవిరి పట్టడం మంచి ఎంపిక… ఇది మ్యాజిక్ లాగా పనిచేస్తుంది.. అవనవసరంగా మాత్రలు మింగడం మానుకోండి.” అని సమంత స్టోరీలో రాసుకొచ్చింది. అయితే ఈ విధానాన్ని కొంతమంది వైద్యులు సోషల్‌ మీడియాలో తప్పుపట్టారు. అప్పటికే దెబ్బ తిన్న ఊపిరి తిత్తులలోకి హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ ప్రవేశిస్తే, న్యుమోనియా సహా పలు వ్యాధులను కలగజేస్తుంది. కొన్నిసార్లు మరణానికి దారి తీస్తుందని హెచ్చరించారు.

Read Also: Chinmayi Sripada: నా భర్త అలాంటి వాడు.. ట్రోలర్స్‌కు చిన్మయి స్ట్రాంగ్ వార్నింగ్

అలాగే లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార పంచుకున్న ఓ పోస్ట్‌ కూడా చర్చకు దారి తీసింది. ఈ ఏడాదిలోనే ఇన్‌స్టాలోకి అడుగుపెట్టిన నయనతార.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇన్‌స్టా వేదిక తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మందారపువ్వులతో చేసే టీ గురించి పోస్ట్ పెట్టారు. ఆ టీ తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుయన్నాయని వెల్లడించారు. రోగ నిరోధక శక్తి పెరుగుతుందని.. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇది ఉపశమనం కలిగిస్తుందని చెప్పారు. దీనిపై ఓ వైద్యుడు స్పందించాడు. ది లివర్‌ డాక్టర్‌ అనే ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ పెట్టాడు. 8.7 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను ఆమె తప్పుదోవ పట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆమె మాటల్లో నిజం లేదని పేర్కొన్నాడు. ఆయన ట్వీట్‌ వైరల్‌గా మారడంతో నయనతార తన పోస్ట్‌ను తొలగించారు.

ఈ పోస్ట్‌పై విమర్శలు రావడంతో తొలగించిన నయనతార.. తాజాగా ఇన్‌స్టాలో ఆసక్తికర సందేశాన్ని పంచుకున్నారు. ‘‘తెలివి తక్కువ వారితో వాదించవద్దు. ఆ విధంగా మిమ్మల్ని వారి స్థాయికి తీసుకువెళ్లి, ఓడిస్తారు’’ అని అమెరికన్‌ రైటర్‌ మార్క్ ట్వైన్ సూక్తిని నయన్‌ షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనని విమర్శించిన వారిని ఉద్దేశించే ఈవిధంగా పెట్టారని పలువురు భావిస్తున్నారు.

 

Exit mobile version