NTV Telugu Site icon

Shraddha Walker Case: శ్రద్ధ కేసులో మరో ట్విస్ట్.. సీసీటీవీ కెమెరాలో ఆ దృశ్యాలు

Shraddha Walker Case

Shraddha Walker Case

Shraddha Walker Case: శ్రద్ధా వాకర్‌ను హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా గత నెల తెల్లవారుజామున తన ఇంటి వెలుపల నుంచి బ్యాగ్‌తో నడుచుకుంటూ వెళ్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో వెల్లడైంది. అఫ్తాబ్‌ శ్రద్ధ శరీర భాగాలను మోసుకెళ్ళినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫుటేజీని ధృవీకరించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అక్టోబరు 18న రికార్డయిన ఈ ఘోర హత్యకేసులో బయటపడిన తొలి విజువల్ సీసీటీవీ ఫుటేజీ ఇదే. నిందితుడు వీపున ఓ సామాను సంచి.. చేతుల్లో కార్టన్‌ ప్యాకేజీతో వీధిలో నడుస్తున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. అతని ముఖం స్పష్టంగా లేదు, కానీ పోలీసులు అఫ్తాబ్ అని పేర్కొన్నారు.

ఇవాళ తెల్లవారుజామున ఢిల్లీ పోలీసులు అఫ్తాబ్ అమీన్ పూనావాలా ఫ్లాట్ నుంచి పదునైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని శ్రద్ధా వాకర్ మృతదేహాన్ని నరికివేయడానికి ఉపయోగించారని వారు అనుమానిస్తున్నారు. కఠినమైన విచారణ తర్వాత అఫ్తాబ్ నిజాన్ని వెల్లడించడం ప్రారంభించాడు. అఫ్తాబ్‌కు చెందిన ఛతర్‌పూర్ ఫ్లాట్ నుంచి కీలకమైన సాక్ష్యాలను తిరిగి పొందడంలో పోలీసులకు తాను సహాయపడినట్లు వారు తెలిపారు.శుక్రవారం అఫ్తాబ్ గురుగ్రామ్‌లో పనిచేసే స్థలం నుంచి భారీ నల్లటి పాలిథిన్ బ్యాగును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Twitter Poll: ట్రంప్ ట్విట్టర్‌ ఖాతాను పునరుద్ధరించాలా?.. పోల్‌ ఏర్పాటు చేసిన మస్క్

శ్రద్ధా, అఫ్తాబ్ మేలో ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లారు. నాలుగు రోజుల తరువాత ఆమెను గొంతు కోసి చంపాడు. తర్వాత మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి, అతను ఫ్రిజ్‌లో ఉంచి అడవిలో పారేశాడు. అఫ్తాబ్ ఐదు రోజుల్లో నార్కో విశ్లేషణ పరీక్షను ఎదుర్కోనున్నాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ వాకర్ హత్య కేసు విచారణను వేగంగా పూర్తి చేస్తున్నారు పోలీసులు. దర్యాప్తులో భాగంగా మెహ్రౌలీ అడవిలో శ్రద్ధ శరీర భాగాల కోసం ముమ్మరంగా గాలించారు. నవంబర్ 16న మూడుసార్లు ఈ అడవినంతా జల్లెడపట్టారు. ఈ క్రమంలోనే అక్కడ ఓ పెద్ద ఎముకను గుర్తించారు. అది ఫీముర్(తొడ ఎముక) అయి ఉంటుందని పేర్కొన్నారు. ఆ తర్వాత ‍అడవిలోని ఇతర ప్రాంతాల్లో మరో రెండు ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి కచ్చితంగా శ్రద్ధవే అయి ఉంటాయని చెబుతున్నారు. అడవిని గాలించేందుకు నిందితుడు అఫ్తాబ్‌ను కూడా తీసుకెళ్లారు పోలీసులు. ముక్కలు ముక్కలుగా చేసిన శ్రద్ధ శరీర భాగాలను ఎక్కడ పడేశాడో చూపించమన్నారు. ‍‍అతడు చెప్పిన వివరాల ప్రకారం అడవినంతా వెతికి మొత్తం మూడు ఎముకలను గుర్తించారు.ఢిల్లీ మొహ్రౌలీలో ఆరు నెలల క్రితం జరిగిన శ్రద్ధ హత్య ఘటన ఇటీవలే వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు, శ్రద్ధ బాయ్‌ఫ్రెండ్ అఫ్తాబ్ ఇప్పటికే నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు.